డోంట్ స్లీప్ హిట్ పక్కా

15-10-2026 | 05:15am

మలయాళ దర్శకుడు షామ్‌దత్(Malayalam director Shamdat), యంగ్ హీరో ఇంద్ర రామ్ కాంబో సైకలాజికల్ థ్రిల్లర్ ‘డోంట్ స్లీప్(Don't sleep)’. సినిమా టోగ్రాఫర్ షామ్‌దత్(Cinematographer Shamdat) ఈ చిత్రంతో తెలుగులో దర్శకుడిగా అడుగుపెడుతున్నారు. వీ డ్రీమ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై వీ చుడామణి నిర్మిస్తున్నారు. ‘చౌర్య పాఠం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇంద్ర రామ్ ఈ సినిమాలో హీరో కాగా, జోయీతా బెనర్జీ హీరోయిన్. రవీంద్ర విజయ్, తబా రీమా, సునీల్ థాపా, ఆడుకలం నరేన్, కల్పలత, అనీష్ కురువిల్లా, వెన్నెల కిశోర్, నాగి జబర్దస్త్, డాక్టర్ భద్రం, రఘుబాబు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.

నాగచైతన్య, విజయ్ సేతుపతి, దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) కలిసి ఈ సినిమా టీజర్‌ను బుధవారం విడుదల చేశారు. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో ఇంద్రరామ్ మాట్లాడుతూ.. “సినిమా చాలా బాగా వచ్చింది. కచ్చితంగా సూపర్ హిట్ కొట్టబోతున్నామనే నమ్మకం ఉంది” అన్నారు. హీరోయిన్ జోయీతా బెనర్జీ మాట్లాడుతూ.. “తెలుగులో ఇది నా తొలి సినిమా.  తప్పకుండా ఈ సినిమా అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది” అని తెలిపింది.

డైరెక్టర్ షామ్ దత్ మాట్లాడుతూ.. “ఇది రెగ్యులర్ సినిమా కాదు. చాలా కొత్త కథ” అని చెప్పారు. నిర్మాత ప్రసాద్ మాట్లాడుతూ.. “శ్యామ్ దత్ డీవోపీగా చేసిన సినిమాల్లో 80 శాతానికి పైగా విజయాలున్నాయి. ఈ సినిమాతో దర్శకుడిగా కూడా ఆయన గ్యారెంటీగా మంచి సినిమా అందిస్తారనే నమ్మకం ఉంది” అన్నారు. నటుడు అనీష్ కురువిల్లా, డైరెక్టర్లు కళ్యాణ్ శంకర్, దేవకట్టా, శ్రీరామ్ ఆదిత్య, రాధాకృష్ణ ఈ వేడుకలో మాట్లాడారు. 

మరిన్ని వార్తలు