అమ్మ కదిలి వచ్చెనమ్మా..

15-10-2026 | 05:15am

మాచో స్టార్ టీ గోపీచంద్(Gopichand) ప్రతిష్టాత్మక చారిత్రక యాక్షన్ చిత్రం ‘భరతవర్ష(Bharathavarsha)’. సంకల్ప్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. పవన్‌కుమార్ సమర్పిస్తున్నారు. ఇందులో రీతూవర్మ కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంటున్న నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇదిలావుండగా, శరన్నవరాత్రుల సందర్భంగా మేకర్స్ ఈ సినిమా నుంచి రెండోపాటను బుధవారం విడుదల చేశారు.

‘అమ్మ కదిలి వచ్చె’ అంటూ సాగే ఈ పాటకు అనుదీప్ దేవ్ సంగీతం(Music by Anudeep Dev) అందించగా, కల్యాణ్ చక్రవర్తి త్రిపురనేని రాశారు. స్కంద వేలువలి బృందం ఆలపించారు. ‘అమ్మ కదిలి వచ్చెనమ్మా.. అమ్మ కదిలివచ్చేనే.. కరమున పట్టేదవే వేవేల శూలాలనే అంబవో శూలాంబా..’ అంటూ సాగుతోందీ గీతం. ఈ పాటలో కథానాయకుడు గోపీచంద్, కథానాయకి రీతూ వర్మ అద్భుతంగా కనిపించారు. ఈ చిత్రానికి సంగీతం: అనుదీప్ దేవ్; డీవోపీ: సౌందర్ రాజన్; యాక్షన్: వెంకట్, పృథ్వీ, రియల్ సతీశ్; ఎడిటర్: చోటా కే ప్రసాద్; ప్రొడక్షన్ డిజైన్: చిన్న. 

మరిన్ని వార్తలు