ఏడు భాషల్లో గోంధళ్
ఆస్కార్ రేసులో(Oscar Race) నిలిచిన భారతీయ చిత్రం() ‘గోంధళ్(Gondhal)’ నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా 7 భాషల్లో రీ-రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా విడుదల చేసిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రానికి సంబంధించిన గ్లోబల్ ట్రైలర్(Global Trailer) ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. 99వ అకాడమీ అవార్డ్స్(Academy Awards) (ఆస్కార్ 2027) కోసం ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్(Best International Feature Film)’ కేటగిరీలో భారతదేశం తరఫున ఈ సినిమా అధికారికంగా ఎంపికైన విషయం తెలిసిందే.
ఇప్పుడీ మరాఠీ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, ఇంగ్లీష్, మరాఠీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏడు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతున్న తొలి మరాఠీ సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమా డబ్బింగ్, లిప్-సింక్ కోసం ఏఐ -ఆధారిత సాంకేతికతను ఉపయోగించారు. దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతాన్ని అందించారు.
మహారాష్ట్ర సాంస్కృతిక సంప్రదాయాల నేపథ్యంలో సాగే ఈ కథ, సుమన్, ఆనందరావు అనే కొత్తగా పెళ్లయిన జంట జీవితం చుట్టూ తిరుగుతుంది. వారి వ్యక్తిగత కోరికలు, వైవాహిక బాధ్యతలు, భక్తి మధ్య జరిగే కొన్ని రహస్య సంఘటనల సమాహారమే ఈ సైకలాజికల్ థ్రిల్లర్. దావఖర్ ఫిలమ్స్ పతాకంపై సంతోష్, దీక్షా దావఖర్ నిర్మించిన ఈ చిత్రంలో ఇషితా దేశ్ముఖ్, కిషోర్ కదమ్, యోగేశ్ సోహోని, నిషాద్ భోయిర్ ముఖ్య పాత్రలు పోషించారు.