మేం విడిపోతున్నాం
పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల ప్రకటన
హైదరాబాద్, నవంబర్ 9 (విజయక్రాంతి): ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) కొణిదెల, అన్నా కొణిదెల(Anna Konidela) దంపతులు విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని ఇద్దరూ కలిసి సంయుక్తంగా సోమవారం రాత్రి ఓ ప్రకటనలో వెల్లడించారు. ‘మా జీవితంలో చాలా కాలం కలిసి ప్రయాణించిన తర్వాత పరస్పర అవగాహన, గౌరవంతో ఇప్పుడు విడిపోవాలని నిర్ణయించుకున్నాం.
మా వైవాహిక బంధానికి ముగింపు పలికినప్ప టికీ, మేమిద్దరం మంచి స్నేహితు లుగా, మా పిల్లలకు అంకితభావం కలిగిన తల్లిదండ్రులుగా కొనసాగుతాం. పిల్లల సంతోషం, సంక్షేమమే మా ఉమ్మడి ప్రాధాన్య తగా ఉంటుంది’ అని అందులో పేర్కొన్నారు. తమ గోప్యతను గౌరవిస్తారని, సహకరిస్తారని ఆశిస్తున్నామని వారు తెలిపారు.