ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్పీదే గెలుపు

10-11-2026 | 05:15am

రెడ్లు, కాపుల కాలం చెల్లింది

ఇకపై బీసీలదే రాజ్యాధికారం

యాదగిరిగుట్టలో తీన్మార్ మల్లన్న

యాదగిరిగుట్ట, నవంబర్ 9 (విజయక్రాంతి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రా జ్యాధికార పార్టీదే గెలుపని, కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాదని టీఆర్పీ అధ్యక్షుడు తీర్మాన్ మల్లన్న(TRP President Teenmar Mallanna) అన్నారు. తీన్మార్ మల్లన్న చేపట్టిన బీసీ రాజ్యాధికార యాత్ర 47వ రోజు యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టకు చేరుకున్నది. యాదగిరిగుట్టలో నిర్వహించిన కా ర్నర్ మీటింగ్‌లో మల్లన్న ప్రసంగించారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో రాహుల్‌గాంధీ ఆరు నెలల్లో కులగణన చేస్తానని, బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తానని హామీ ఇచ్చారని, తూతూ మంత్రంగా కులగణన చేసిన కాంగ్రెస్ ప్రభు త్వం బీసీలను వంచన చేసిందన్నారు.

రెడ్లు, రావుల పరిపాలనలో తీవ్రంగా నష్టపోయిన బీసీలు ఇప్పుడు ఆలోచనలో పడ్డారని, బీసీలకు రాజ్యాధికారం వస్తేనే తమ బతుకులు మారుతాయని ఆలోచిస్తున్నారని అన్నారు. ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజ్యాధికార పార్టీ అభ్య ర్థి అయిన అశోక్ గెలుపు ఖాయమన్నారు.  2028  ఎన్నికల్లో టీఆర్పీ గెలుస్తుందని, బీసీ బిడ్డేలే ఎమ్మెల్యేలుగా గెలిచి అసెంబ్లీకి పోతారన్నారు.  పార్టీ రాష్ట్ర కార్యదర్శి పిట్టల శంక ర్, కార్యదర్శులు ప్రసన్న, బీకు నాయక్, జా తీయ వ్యవహారాల ఇంచార్జి పూజిత, ఎమ్మె ల్సీ అభ్యర్థి అశోక్,  నాయకులు కొమ్మిడి శెట్టి నరసింహ, జిల్లా మహిళా అధ్యక్షురాలు సు నీత, యాదగిరిగుట్ట అధ్యక్షుడు రమేష్, యా దగిరి గుట్ట మహిళా అధ్యక్షురాలు పుష్ప, ఎస్సీ సెల్ అధ్యక్షులు రఘు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు