ప్రజాబలంతో సునామీ
- సంక్రాంతి తర్వాత ‘ప్రజాబలం’ పేరుతో పర్యటనలు
- కేసీఆర్ చేసిన అప్పులు, తప్పులు సరిదిద్దుతూ అభివృద్ధి వైపు..
- ఆయనకు ఎత్తిపోతలంటే ఎత్తుడూ పోసుడే!
- అసెంబ్లీకి రమ్మంటే ఫామ్‌హౌస్‌లో బోర్లా పన్నడు
- కేటీఆర్‌కు గడ్డం రావడానికే 50 ఏండ్లు పట్టింది.. బుద్ధిరావడానికి ఇంకెన్నేండ్లు పడ్తదోనని విమర్శ
- ఎల్ నినోను కలిసి ఎదుర్కొందామని ప్రజలకు పిలుపు
- కొడంగల్‌లో రూ.9,053 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
- ఆ దెబ్బకు మోదీ, కేడీ కొట్టుకుపోవాల్సిందే: సీఎం రేవంత్‌రెడ్డి
వికారాబాద్, నవంబర్- 9 (విజయక్రాంతి): సంక్రాంతి తర్వాత తాను ‘ప్రజాబలం’ పేరిట నియోజకవర్గాల్లో పర్యటిస్తానని.. ఆ సునామీ దెబ్బకు మోదీ, కేడీ కొట్టుకుపోవాల్సిందేనని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. నమ్మి ధనిక రాష్ట్రాన్ని చేతిలో పెడితే అప్పులకుప్పగా కేసీఆర్ మార్చారని ఆయన మండిపడ్డారు. ‘రాష్ట్ర సమస్యలపై మాట్లాడుదామంటే అసెంబ్లీకి రాడు. బయటకూ రాడు. పదేండ్ల పాలనలో లక్షల కోట్ల అప్పులు చేసిండు.
ప్రజల నెత్తిన అప్పు.. చేతిలో చిప్ప పెట్టి.. ఇప్పుడు ఫామ్‌హౌస్‌లో బకాసురుడిలెక్క పన్నడు’ అని దుయ్యబట్టారు. కేసీఆర్‌కు కనీసం కృతజ్ఞత కూడా లేదని, ఆ నాడు ఉద్యమ సమయంలో ఆయనను పాలమూరు ప్రజలు ఎంపీగా గెలిపిస్తే.. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యి ఇక్కడి జనాన్ని పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజులుగా వికారాబాద్ జిల్లా హకీంపేటలో జరుగుతున్న మెగా రైతు మేళా ముగింపు కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ‘రైతన్న ఆత్మీయ సభ’లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.
పాలమూరు గుండెలపై తన్నిండు
నాడు కేసీఆర్‌ను ఎంపీగా గెలిపించి పాలమూరు ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని, ఆ తర్వాత రాష్ట్రం ఏర్పడి ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఏం చేశారని సీఎం రేవంత్ ప్రశ్నించారు. ‘పాలమూరు రుణం తీర్చుకుంటాడేమో అనుకున్నం. ఇక్కడి ప్రాజెక్టులను పూర్తి చేస్తాడని ఆశపడ్డం. కానీ ఆయన మన పాలమూరు గుండెలపై తన్ని కృష్ణా నదిలో పడేసి గజ్వేల్ పోయిండు. పాలమూరుపై కక్ష పెంచుకున్నడు. కేసీఆర్‌కు కనీసం కృతజ్ఞత కూడా లేదు. తెలంగాణ వచ్చాక కూడా పదేండ్లు ఇక్కడ చుక్క నీరు కూడా ఇవ్వలేదు’ అని మండిపడ్డారు.
అభివృద్ధి చేసే అవకాశం వచ్చింది
ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో, కొడంగల్ ప్రజల దీవెనతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం తనకు దక్కిందని సీఎం రేవంత్ అన్నారు. ‘నాకు కనీసం మంత్రిగా అనుభవం లేకపోయినా సహచర మంత్రులు సైతం నాకు ఎంతగానో సహకరిస్తున్నారు. 2007 నుంచి ఇప్పటివరకు ఏ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా రోజూ 18 గంటలు ప్రజల కోసం పనిచేస్తున్నా. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోని నంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నా’ అని వివరించారు. కొడంగల్ ప్రాంతానికి దేశంలోనే గుర్తింపు తెచ్చేలా అభివృద్ధి చేస్తానని, వలసలు అనే పదం వినపడకుండా చేస్తానని తెలిపారు. పాలమూరు లో పచ్చని పొలాలు, పారిశ్రామిక అభివృద్ధి కనిపించేలా చేస్తానని, ఎలాంటి చదువుకైనా కొడంగల్‌కు వెళ్లాలనే విధంగా ఎడ్యుకేషన్ హ బ్ ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చా రు.
ఆ అప్పులకే ఏటా 80వేల కోట్ల వడ్డీ
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదట్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేకున్నా ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇవ్వడం మొదలుపెట్టామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా 5వ తేదీన వేతనాలు ఇస్తున్నట్లు చెప్పారు. ‘పదేండ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్.. ఉద్యోగులకు ఏనాడూ ఒకటో తేదీన వేతనాలు ఇవ్వలేదు. పదేండ్లు తెలంగాణ ప్రజ లు పన్నుల రూపంలో కేసీఆర్ చేతికి 20 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చారు.
ఇవి కాకుండా దొ రికినకాడల్లా అందినకాడల్లా ఎనిమిది లక్షల 11 వేల కోట్ల రూపాయలు కేసీఆర్ అప్పులు చేసిం డు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిండు. నెత్తిన అప్పులు.. చేతిలో చిప్ప పెట్టి ఆయనగారు పో యి ఫామ్‌హౌస్‌లో బోర్లా పడుకున్నడు. ఆయ న చేసిన తప్పులను ఒకటొకటి సరిదిద్దుతూ, చిక్కుముడులను విప్పుకుంటూ, అప్పులను తీర్చుకుంటూ రాష్ట్రాన్ని ప్రజా ప్రభుత్వం అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నది. కేసీఆర్ చేసిన అప్పులకు, తప్పులకు సంవత్సరానికి 80 వేల కోట్ల రూపాయలు వడ్డీగా కడుతున్నాం. ఈ 34 నెలల్లో రెండు లక్షల కోట్ల రూపాయలు కట్టాం’ అని వివరించారు. కేసీఆర్‌కు ప్రాజెక్టులంటే ఎత్తిపోతలేనని.. ఎత్తిపోతలంటే ఎత్తుడు పోసుడేనని ఆయన విమర్శించారు. కమీషన్లకు కక్కుర్తి పడి కాళేశ్వరాన్ని కట్టి, కూల్చారని, ప్రజాధనాన్ని దోచుకున్నారని దుయ్యబట్టారు.
కేటీఆర్‌కు బుద్ధి వచ్చేదెన్నడో..?
‘తండ్రి(కేసీఆర్) చేసిన ఘనకార్యం చాలదన్నట్టు ఇప్పుడు కొడుకు(కేటీఆర్) బయలుదేరా డు. మక్తల్ నారాయణపేట ప్రాజెక్టును ఎలా కడతావంటున్నడు. కేటీఆర్‌కు గడ్డం రావడానికే 50 ఏండ్లు పట్టింది. ఆయనకు బుద్ధి రావ డానికి ఇంకెన్నేండ్లు పడుతుందో’ అని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు.
‘కేటీఆర్..! నువ్వు గడ్డం మోకాళ్ల దాకా పెంచుకున్నా.. పది జన్మలు ఎత్తినా.. తాటి చెట్టుకు ఉరేసుకున్నా.. గండిపేట చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నా.. ఎన్నటికీ నువ్వు రేవంత్ రెడ్డివి కాలేవు. రేవంత్ రెడ్డివి కావాలంటే గుండె ధైర్యం ఉండాలి.. కార్యకర్తల కోసం పనిచేయాలి.. నమ్ముకున్నోడి కోసం పనిచేయాలి. నమ్ముకున్నోడిని నట్టేట ముంచే నువ్వు ఎన్నటికీ రేవంత్‌రెడ్డివి కాలేవు’ అని హెచ్చరించారు. కొడంగల్ ప్రజలు అం డగా ఉంటే ఢిల్లీలో మోదీనైనా, గల్లీలో కేడీనైనా ఎదిరిస్తానని చెప్పారు. నిరంతరం పనిచేసి దేశంలోనే తెలంగాణను నంబర్ వన్‌గా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు.
నీళ్లను జాగ్రత్తగా వాడుకుందాం
ఎల్ నినో ప్రభావాన్ని కలిసికట్టుగా ఎదుర్కొందామని ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆరుతడి పంటలే వేయాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. నీళ్లను జాగ్రత్తగా వాడుకుందామన్నారు.