ఇది తుగ్లక్ ప్రభుత్వం!

10-11-2026 | 05:15am
  1. ప్రజలు లేకుండా ప్రజాభిప్రాయ సేకరణా!
  2. కరువు పరిస్థితుల్లో సుందరీకరణ పనులేంటి? 
  3. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

హైదరాబాద్ నవంబర్ 9 (విజయక్రాంతి): మూసీ ప్రాజెక్టు వ్యవహారంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై విమ ర్శలు గుప్పించారు. ప్రజలు లేకుండానే ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నారని, సమ గ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధం కాకముందే పనులకు టెండర్లు పిలుస్తున్నారని ధ్వజమెత్తారు. దీనిని తుగ్లక్ ప్రభుత్వం కాక ఇంకా ఏమనాలని ఎద్దేవా చేశారు. ఈ మేరకు తన ‘ఎక్స్’ ఖాతాలో సోమవారం ఒక పోస్ట్ పెట్టారు.

రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్న సమయంలో మూసీ సుందరీకరణ పనులకు ప్రాధాన్యం ఇవ్వడం ఏమిటని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజల అవసరాలు, ప్రాజెక్టు ప్రాధాన్యతలను పక్కనపెట్టి సుందరీకరణ పేరుతో పనులు చేపడుతున్నారని విమర్శించారు. మూసీ ప్రాజెక్టులో పారదర్శకత లేదని, ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో ప్రజల గొంతు వినిపించకుండా చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ, డీపీఆర్ రూపకల్పన, ప్రజల భాగస్వామ్యంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.


మరిన్ని వార్తలు