రంగారెడ్డి కలెక్టర్కు 6 నెలల జైలు
- కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు సంచలన తీర్పు
- 22-ఏ నిషేధిత జాబితాలో కొన్ని భూముల తొలగింపుపై నిర్లక్ష్యం
- కోర్టును ఆశ్రయించిన బాధితులు
- కలెక్టర్ నారాయణరెడ్డికి శిక్ష విధించిన కోర్టు
రంగారెడ్డి బ్యూరో, నవంబర్ 9 (విజయక్రాంతి): న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిన కేసులో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి(Collector Narayana Reddy)కి హైకోర్టు 6 నెలల సాధారణ జైలు శిక్షతో పా టు రూ.2 వేల జరిమానా విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. అయితే, ఈ తీర్పుపై అప్పీలు చేసుకునేందుకు వీలుగా శిక్ష అమలును నాలుగు వారాల పాటు నిలిపివేస్తూ ధర్మాసనం ఊరట కల్పించింది.
జస్టిస్ కె లక్ష్మణ్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాస నం కోర్టు ధిక్కరణ పిటిషన్పై సమగ్ర విచారణ జరిపి ఈ ఉత్తర్వులు వెలువరించింది. రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని సెక్షన్ 22-ఏ కింద నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చిన కొన్ని భూములను ఆ జాబితా నుంచి తొలగించాలని కో రుతూ బాధితులు రెవెన్యూ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. దీనిపై 60 రో జుల్లోగా నిబంధనలమేరకు నిర్ణయం తీసుకోవాలని 2025 ఆగస్టులో అప్పటి కలెక్టర్ ను హైకోర్టు ఆదేశించింది.
నిర్ణీత గడువు దాటినా అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో బాధితులు 2025 అక్టోబర్ 15న హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ధిక్కరణ పిటిషన్ కోర్టు దృష్టికి వ చ్చాకే జిల్లా యంత్రాంగంలో చలనం వచ్చిందని, ఆ తర్వాతే పిటిషనర్లకు నోటీసులు జారీ చేశారని హైకోర్టు స్పష్టం చేసింది. 20 26 ఫిబ్రవరి 26న బాధితుల వినతిని తిరస్కరిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు ఇవ్వగా, ఆ త ర్వాత జూలై 8న మరోసారి తిరస్కరణ ఉత్తర్వులు జారీ చేయడాన్ని కోర్టు తప్పుపట్టింది.
ఒకే రకం భూములపై భిన్న నిర్ణయాలు
వివాదాస్పద భూమికి సంబంధించి నాలుగు సర్వే నంబర్లు (536, 537, 657, 658) ఉండగా, ఒకే రకమైన స్వభావం ఉన్న భూముల్లో సర్వే నంబర్ 537ను మాత్రం నిషేధిత జాబితా నుంచి తొలగించి, మిగిలిన 536, 657, 658 సర్వే నంబర్లను నిషేధిత జాబితాలోనే కొనసాగించడంపై హైకోర్టు నిలదీసింది.
ఒకే స్వభావం ఉన్న భూములపై ఇలాంటి వైరుధ్య నిర్ణయాలు తీసుకోవడానికి గల కారణాలను ప్రశ్నించింది. ఉత్త ర్వులు సరైనవా కాదా అని కాకుండా అ మ లు చేయడమే ముఖ్యమని, గతంలో కోర్టు ఇచ్చిన తీర్పుల చట్టబద్ధతను ధిక్కరణ విచారణ సమయంలో ప్రశ్నించడానికి వీల్లేదని ధర్మాసనం పేర్కొంది. కలెక్టర్ వివరణను తోసిపుచ్చుతూ ఆరునెలల జైలు, జరిమానా విధించింది. అప్పీలుకు వెళ్లేందుకు వీలుగా శిక్ష అమలుపై 4 వారాల స్టే విధించింది.
అఫిడవిట్లో పచ్చి అబద్ధాలు
విచారణ సందర్భంగా కలెక్టర్ సమర్పించిన వివరణకు, ఆయన దాఖలు చే సిన అఫి డవిట్కు అసలు పొంతన లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఫిబ్రవరి 21న జరిగిన విచారణకు ఆర్డీవో, తహసీల్దార్, సంబంధిత రెవెన్యూ అధికారులు హాజరైనటు కలెక్టర్ అఫిడవిట్లో పేర్కొన్నారు. అయితే అధికారిక రికార్డులను పరిశీలించగా అక్కడ వారి సంతకాలు లేవని కోర్టు గుర్తించింది. బాధ్యతాయుతమైన ఐఏఎస్ అధికారి హోదాలో ఉండి అఫిడవిట్లో అసత్యాలు పేర్కొనడా న్ని ధర్మాసనం పచ్చి అబద్ధంగా అభివర్ణించింది.