ఏనాటి వరమో నువ్వు..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Tollywood star heroine Rashmika Mandanna) ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘మైసా’ నుంచి మరో అందమైన పాట ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలోని రెండో పాట ‘ఏనాటి వరమో నువ్వు..’ను చిత్రబృందం సోమవారం విడుదల చేసింది. ‘నా కన్నుల్లో వెలుగై నువ్వుంటే..’ అంటూ సాగుతున్న ఈ మెలోడీ ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తోంది. ఈ గీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ స్వరపరిచారు. రెహమాన్ సాహిత్యం అందించగా, కృష్ణ తేజస్వి ఆలపించారు.
ఐదు భాషల్లో విడుదల చేసిన ఈ పాటలో తండ్రీకూతుళ్ల మధ్య ఉండే అనుబంధం, ప్రేమ, ఆప్యాయతలను హృద్యంగా ఆవిష్కరించారు. అన్‌ఫార్ములా ఫిలమ్స్ బ్యానర్‌పై అజయ్ సాయిపురెడ్డి, అనిల్ సయ్యపురెడ్డి, వీరసాయి గోప భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. రవీంద్ర పుల్లె కథ, దర్శకత్వం అందిస్తున్నారు. గోండు గిరిజన తెగల సంస్కృతి, జీవన విధానం నేపథ్యంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఇందులో రష్మిక శక్తిమంతమైన గోండు గిరిజన మహిళ పాత్రలో కనిపించనున్నారు.
సముద్రఖని, ఈశ్వరీ రావు, రాహుల్ రవీంద్రన్, రావు రమేశ్, శివ కందుకూరి, తారక్ పొన్నప్ప, గురు సోమసుందరం, నిధి సింగ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జేక్స్ బిజోయ్ సంగీత దర్శకుడిగా, శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రాఫర్‌గా, కార్తీక శ్రీనివాస్ ఎడిటర్‌గా, కెచా యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.