నానితో ప్రేమకథ!

15-10-2026 | 05:10am

కన్నడ సౌందర్యం రుక్మిణి వసంత్(Kannada beauty Rukmini Vasanth) ప్రస్తుతం టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది. పరిశ్రమలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే తన అద్భుత నటన, అందంతో వరుస విజయాలను అందుకుంటున్న ఈ భామకు.. తాజాగా తెలుగులో మరో బంపర్ ఆఫర్ దక్కినట్టు సోషల్ మీడియాలో(Social Media) జోరుగా ప్రచారం సాగుతోంది. ‘96’, ‘మెయ్యళగన్’ (సత్యం సుందరం) వంటి ఫీల్ గుడ్ ఎమోషనల్ చిత్రాలతో మెప్పించిన టాలెంటెడ్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో, నేచురల్ స్టార్ నాని హీరోగా ఒక నూతన చిత్రం తెరకెక్కబోతున్నట్టు సమాచారం.

పూర్తిగా మనసుకు హత్తుకునే సున్నితమైన ప్రేమకథగా రూపొందనున్న ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా ఎంపికైనట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర ఎంతో శక్తిమంతంగా, కథను మలుపు తిప్పే ప్రాధాన్యతతో ఉంటుందట. అందుకే ఆ పాత్ర కోసం మేకర్స్ రుక్మిణిని ఖరారు చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్.

ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘డ్రాగన్’లో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన నటిస్తున్న ఈ క్రేజీ బ్యూటీ ఖాతాలో.. ఇప్పుడు నాని సినిమా కూడా చేరడం విశేషం. ఇలా బ్యాక్ టు బ్యాక్ టాలీవుడ్ స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటున్న రుక్మిణి వసంత్ క్రేజ్ చూస్తుంటే, త్వరలోనే తెలుగు ఇండస్ట్రీని ఈమె ఏలడం ఖాయంగా కనిపిస్తోంది. 

మరిన్ని వార్తలు