డెహ్రాడూన్ ఘటన స్ఫూర్తితో..

21-11-2026 | 05:00am

నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న బహుభాషా క్రైమ్ థ్రిల్లర్ ‘అన్‌ఎక్స్‌పెక్టెడ్ – సఫేద్ సచ్(Unexpected – Safed Sach)’ చిత్రం. యశ్ వీరా ఫిల్మ్స్ సమర్పిస్తుండగా, ప్యారేలాల్ గుండెచా (సోజాత్ రోడ్ వాలా) నిర్మిస్తున్నారు. ‘గరుడవేగ’ అంజి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ, సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమాలో పృథ్వీరాజ్, తంబి రామయ్య, సంజయ్ సింగ్, గంజా కరుప్పు కీలక పాత్రల్లో కనిపిస్తారు. ప్రశాంత్ నారాయణన్ ఒక ముఖ్య పాత్రను పోషిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా ఫస్ట్-లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో సిక్కు పోలీస్ అధికారి అవతారంలో సంజయ్ కపూర్ కనిపిస్తుండగా, ప్రశాంత్ నారాయణన్ ఇంటెన్స్ లుక్‌లో ఉన్నారు. ఎస్తేర్ అనిల్ సాంప్రదాయ తలపాగా కనిపించారు. డెహ్రాడూన్ ఇంటర్-స్టేట్ బస్ టెర్మినల్ (ఐఎస్‌బీటీ)కి సంబంధించిన ఒక కేసును దర్యాప్తు చేసే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఎస్‌ఎస్‌పీ భరత్ సింగ్ పాత్రలో సంజయ్ కపూర్ నటించారు. హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, గర్వాలీ, గుజరాతీ, పంజాబీ, భోజ్‌పురి వంటి తొమ్మిది భాషల్లో రూపొందుతోందీ సినిమా. 2027లో విడుదల కానుందీ చిత్రం.

మరిన్ని వార్తలు