డివికి డివికి..

22-11-2026 | 05:20am

వెంకటేశ్(Venkatesh), కల్యాణ్ రామ్(Kalyan Ram) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘జనవరి 12 విడుదల’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో(Directed by Anil Ravipudi) షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. కీర్తి సురేశ్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ‘డివికి డివికి’ని విడుదల చేశారు. అమ్మాయిలందరికీ అంకితం చేసిన ఈ వైబ్రెంట్ సెలబ్రేషన్ సాంగ్.. వదిన, మరదళ్ల మధ్య ఉండే ఆప్యాయత, సరదా సంభాషణలతో సాగుతోంది. జీవీ ప్రకాశ్ కుమార్ కంపోజ్ చేసిన ఈ పాటను అనంత శ్రీరామ్ రాశారు. మధు ప్రియ, హరి ప్రియ పాడారు. సంక్రాంతి పండుగ సందర్భంగా 2027, జనవరి 12న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి; ఎడిటర్: తమ్మిరాజు; ఆర్ట్: ఏఎస్ ప్రకాశ్. 

మరిన్ని వార్తలు