బాలల సమస్యలపై ఇక ప్రత్యేక ప్రజావాణి

15-11-2026 | 08:23pm

ఎంపీడీవో వి ప్రవీణ్ కుమార్.

వెంకటాపురం, నూగూరు, నవంబర్ 15, విజయక్రాంతి: వెంకటాపురం మండలం(Venkatapuram Mandal) బాలల హక్కుల పరిరక్షణ(Protection of Children's Rights), వారి సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఈ నెల 16న ములుగు జిల్లా(Mulugu District) వెంకటాపురం మండలం ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం 'పిల్లల ప్రజావాణి’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సాధారణ ప్రజావాణితో పాటే ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఎంపీడీవో ప్రవీణ్ కుమార్(MPDO Praveen Kumar) వెల్లడించారు.

మండలంలో మారుమూల ప్రాంతాల్లోని పిల్లలు సైతం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. విద్య, వైద్యం, రవాణా, పోలీసు, బాలల సంక్షేమం తదితర అంశాలకు సంబంధించి ఎదురవుతున్న సమస్యలను నేరుగా సంబంధిత శాఖల అధికారులకు వినతుల రూపంలో తెలియజేయవచ్చని సూచించారు.

మరిన్ని వార్తలు