తరాలు మారినా తరగని ఆత్మీయత

15-11-2026 | 08:17pm

బొడ్డు కులస్తుల అపూర్వ సమ్మేళనం

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),నవంబర్ 15: మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామంలో(Thimmapuram Village) బొడ్డు కులస్తుల అపూర్వ సమ్మేళనం(unique combination) ఆదివారం ఘనంగా జరిపారు. గత 40 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం బొడ్డు కులస్తులంతా ఒకచోట చేరి ఆత్మీయంగా పలకరించుకుంటూ పండుగ వాతావరణంలో ఈ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నారు.ఈ ఏడాది కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గత 40 ఏళ్లుగా తూచా తప్పకుండా ఏడాదిలో ఒకరోజు అంతా ఒకచోట కలిసి యోగక్షేమాలు తెలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే ఒరవడిని కొనసాగిస్తూ మరింత కన్నుల పండుగగా ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించుకుంటామని తెలిపారు. అనంతరం గత 40 సంవత్సరాలుగా అందరిని ఒక తాటిపైకి తెస్తూ,కుల అభివృద్ధికి సహకరించిన పలువురిని శాలువాలతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు