తుంగతుర్తికి నూతన పల్లెవెలుగు నైట్-అవుట్ సర్వీసు ప్రారంభం
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),నవంబర్ 15: తుంగతుర్తి,అర్వపల్లి మండలాల(Tungaturthi and Arvapalli mandals) ప్రయాణికుల సౌకర్యార్థం సూర్యాపేట డిపో(Suryapet Depot) ఆధ్వర్యంలో నూతన పల్లెవెలుగు నైట్-అవుట్ బస్సు సర్వీసును(Palle Velugu Night-Out Bus Service) ఆదివారం ప్రారంభించినట్లు సూర్యాపేట డిపో మేనేజర్ వి సునీత(Suryapet Depot Manager V. Sunitha) తెలిపారు. ఈ సర్వీసు ఆదివారం నుండి అందుబాటులోకి వచ్చిందని,ప్రతిరోజు రాత్రి 8:00 గంటలకు సూర్యాపేట న్యూ బస్ స్టేషన్ నుండి బయలుదేరి తిమ్మాపురం,అర్వపల్లి,వెలుగుపల్లి మీదుగా తుంగతుర్తికి చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో ఉదయం 5:00 గంటలకు తుంగతుర్తి నుండి బయలుదేరి వెలుగుపల్లి,అర్వపల్లి,తిమ్మాపురం మీదుగా ఉదయం 6:10 గంటలకు సూర్యాపేటకు చేరుకుంటుంది. ఈ ప్రాంత ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.వివరాలకు 7382943819 నంబర్ ను సంప్రదించాలని సూచించారు.