వ్యక్తి దారుణ హత్య

15-11-2026 | 08:19pm

ఘట్ కేసర్, నవంబర్ 15 (విజయక్రాంతి): మేడ్చల్‌ జిల్లా(Medchal District) ఘట్‌కేసర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి అవుషాపూర్‌లోని జగతి స్వప్న విల్లాస్‌లో ఉన్న స్పార్కిల్‌ క్యాసిల్‌లో ఓ వ్యక్తి దారుణ హత్య గురయ్యాడు. జగతి స్వప్న విల్లాస్‌లో ఉన్న స్పార్కిల్‌ క్యాసిల్‌లో ఇద్దరు సెక్యూరిటీ గార్డుల మధ్య జరిగిన ఘర్షణ హత్యకు దారి తీసినట్లు తెలుస్తుంది. ఈవిల్లాస్‌లో నైట్‌ సెక్యూరిటీగా పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు ఒకే గదిలో ఉంటున్నారు. ఆదివారం ఇద్దరూ మద్యం సేవించగా మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసినట్లు సమాచారం. 

ఈ క్రమంలో మద్యం మత్తులో ఒక వ్యక్తి మరో వ్యక్తిపై రాయితో దాడి చేయడంతో అతడు మృతిచెందినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఘట్‌కేసర్‌ పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, అతడు మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. క్లూస్‌ టీం సహాయంతో ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి పూర్తి వివరాలు, హత్యకు దారితీసిన కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

మరిన్ని వార్తలు