విద్యార్థుల హాజరు పెంచాలి

17-11-2026 | 03:17pm

పాఠశాల తనిఖీలో కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ సూచన

కల్వకుర్తి : మండలం పంజుగుల ప్రాథమికోన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్(District Collector Hemant Keshav Patil) మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో 43 మంది విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులు ఉన్నట్లు తెలుసుకున్నారు. విద్యార్థుల హాజరు శాతం పెంచాలని, విద్యాబోధనలో నాణ్యత పాటించాలని సూచించారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, నిర్మాణంలో ఉన్న కిచెన్ షెడ్ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

మరిన్ని వార్తలు