బిడ్డర్లకు నౌహీరా ఆస్తుల రిజిస్ట్రేషన్

15-10-2026 | 05:05am

15.03  కోట్ల ఏడు స్థిరాస్తులపై ఈడీ చర్యలు పూర్తి

హైదరాబాద్, అక్టోబర్ 14 (విజయక్రాంతి): నౌహీరా షేక్(Nowhera Shaik) (హీరా గోల్ ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్) కేసులో సుప్రీంకోర్టు(Supreme Court) ఆదేశాల మేరకు ఆమెకు చెందిన రూ. 15.03 కోట్ల ఏడు స్థిరాస్తులను బిడ్డర్లకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను(Registration process) ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్)(Enforcement Directorate) హైద రాబాద్ జోనల్ కార్యాలయం బుధవారం పూర్తి చేసింది. రిజిస్ట్రేషన్ అయిన వాటిలో హైదరా బాద్‌లోని షేక్‌పేట్ హెచ్‌ఎస్ రాయల్‌లో ఆరు ఫ్లాట్లు, బంజారాహిల్స్ రోడ్ నెం. 12లో ఎమ్మెల్యే కాలనీలో ఇల్లు ఉన్నాయి.

తమ సంస్థల్లో పెట్టుబడులు పెడితే 36 శాతానికి పైగా వడ్డీ చెల్లిస్తానని నౌ హీరా షేక్ దేశ వ్యాప్తంగా డిపాజిటర్ల నుంచి వేల కోట్ల రూపాయలు వసూలు చేసింది. బాధితుల ఫి ర్యాదుతో నౌహీరాపై కేసు నమోదైంది. ఈడీ పీఎంఎల్‌ఏ, 2002 కింది కేసు నమోదు చేసి ంది. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం, బెయిల్ రద్దు కావడంతో, నౌహీరా షేక్‌ను ఈడీ అధికా రులు హర్యానాలోని గురుగావ్‌లో నకిలీ ఆధార్ కార్డుతో తలదా చుకున్న సమయం లో మే 21, 2026న అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

దర్యాప్తు చేపట్టి ఆమెకు చెందిన పలు ఆస్తుల ను జప్తు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏడు ఆస్తులను వేలం వేసి రిజిస్ట్రేష న్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. పోలీసులు, ఈడీ కళ్లు గప్పి చాలారోజులుగా తిరుగుతున్న ఈమెను ఈడీ అధికారులు హర్యానా గుర్గావ్ నుంచి మే 22న అరెస్టు చేశారు.

మరిన్ని వార్తలు