కల్తీ నెయ్యి.. 130 కోట్ల ఆస్తులు జప్తు

15-10-2026 | 05:10am

టీటీడీ కేసులో ఈడీ చర్యలు

అమరావతి, అక్టోబర్ 14: తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanams) (టీటీడీ) కల్తీ నెయ్యి కేసులో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) చర్యలకు ఉపక్రమించింది.  భోలేబాబా(Bhole Baba),  శ్రీవైష్ణవి డెయిరీ(Sri Vaishnavi Dairy), సుకృతి ఫుడ్స్‌కు చెందిన రూ. 130 కోట్ల ఆస్తులను బుధవారం తాత్కాలికంగా జప్తు చేసింది. భోలేబాబా సంస్థ(Bhole Baba Organization) టీటీడీకీ రూ. 234 కోట్ల కల్తీ నెయ్యిని సరఫరా చేసినట్లు ఈడీ తేల్చింది. దీంతో సంస్థల ప్రమోటర్లు విపిన్‌జైన్, కైలాశ్ చంద్ర మంగ్లా, వారి కుటుంబ సభ్యుల ఆస్తులైపైనా చర్యలు తీసుకున్నారు.

వారిని అరెస్టు కూడా చేశారు. పీఎంఎల్‌ఏ చట్టం(PMLA Act) కింద ఆస్తులను హైదరాబాద్‌లోని ఈడీ జోనల్ ఆఫీస్‌కు అటాచ్ చేశారు. కొనుగోళ్లు, అమ్మకాల్లో నకిలీ లావాదేవీలు జరిగినట్లు తేల్చారు. బ్యాంకుల ద్వారా చెల్లించి, హవాలా మార్గ లో వెనక్కి మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నా యి. గతంలో ఈడీ ౬ రాష్ట్రాల్లోని 16 ప్రాం తాల్లో సోదాలు చేసి, రూ.2.7కోట్లను బ్యాం కులో సీజ్ చేసింది. తాజా చర్యతో రూ.132.55 కోట్లపై చర్యలు తీసుకుంది. 

మరిన్ని వార్తలు