గగన్‌యాన్ మరింత ఆలస్యం

21-11-2026 | 05:00am
  1. సాంకేతిక పరీక్షల నేపథ్యంలో నిర్ణయం
  2. 80 శాతం పనులు పూర్తి కీలక విషయాల్లోనే జాప్యం
  3. విజయవంతం చేయడమే ఇస్రో లక్ష్యమన్న శాస్త్రవేత్తలు

న్యూఢిల్లీ, నవంబర్ 20: భారత్ చేపట్టనున్న తొలి మానవరహిత అంతరిక్ష యాత్ర, ‘గగన్‌యాన్’ మిషన్(Gaganyaan Mission) మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. డిసెంబర్ 2026లోనే ఈ మిషన్‌ను చేపట్టాలని భావించినా, సాంకేతికత పరీక్షలు మరింత ఆలస్యం కానున్న నేపథ్యంలో గగన్‌యాన్ వాయిదా పడనుందని పేరు చెప్పేందుకు ఇష్టపడని కొందరు సీనియర్ శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఇప్పటికే ఈ మిషన్‌కు సంబంధించిన 80 శాతం పనులు పూర్తయ్యాయని, అత్యంత కీలకమైన కార్యకలాపాల్లోనే జాప్యం, మిషన్‌ను సక్సెస్ చేయాలని ఇస్రో కోరుకుంటుండం కూడా జాప్యానికి కారణంగా పేర్కొన్నారు.

ఇంతపెద్ద మిషన్ చేపట్టినప్పుడు మూడు, నాలుగు నెలల జాప్యం అత్యంత సహజమేనని మిషన్ సక్సెస్ కోసం అన్ని సాంకేతికతలను ఒకటికి పదిసార్లు సరైన దిశలో పనిచేస్తున్నాయనేది నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంటుందన్నారు. అనిశ్చితులున్నా, ఆలస్యం అయినా గగన్‌యాన్ సక్సెస్ చేయడంలో ఇస్రో కీలకంగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2019న ఆమోదించిన గగన్‌యాన్ మిషన్ కోవిడ్ ఆలస్యం ఏర్పడింది. 2021, 2022, 2026 లక్ష్యంగా పెట్టుకోగా తాజాగా 2027కు మిషన్‌ను సక్సెస్ చేయాలనే సన్నాహాలను ఇస్రో చేస్తోంది.

మరిన్ని వార్తలు