ఆరామ్‌కోపై హౌతీ దాడులు

15-10-2026 | 05:05am

దెబ్బతిన్న కార్యాలయ భవనం మూడంతస్తులు

నలుగురికి గాయాలు, పూర్తిగా దెబ్బతిన్న 15 ఇళ్లు

రియాద్, అక్టోబర్ 14: సౌదీ అరేబియాలోని(Saudi Arabia) ప్రపంచంలోనే అతిపెద్ద చమురు క్షేత్రం(Oil field) ఆరామ్‌కో ప్రధాన కార్యాలయంపై హౌతీలు విరుచుకుపడ్డారు. మంగళవారం అర్ధరాత్రి ధహ్రాన్ నగరంలోని ఆరామ్‌కో ప్రధాన కార్యాలయాలంపై(Aramco Headquarters) బాలిస్టిక్ క్షిపణి, డ్రోన్‌లతో(Missile and drones) దాడులు చేశారు. దాడిలో కార్యాలయ భవనం దెబ్బతిని భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మూడు అంతస్తులు దెబ్బతిన్నాయి. చిన్నదాడి జరిగిందని సౌదీ మం త్రిత్వ శాఖ ప్రకటించడం గమనార్హం. యెమెన్ రాజధాని సనా నగరంలో కొన్ని ప్రాంతాలను ఖాళీ చేయాలని సౌదీ నేతృత్వంలో సంకీర్ణ దళాల మేజర్ తుర్కీ అల్ మాలికీ నివాసితులకు విజ్ఞప్తి చేసిన కొన్ని గంటలకే ఈ దాడులు జరిగాయి.

కాగా పలు క్షిపణుల శకలాలు రియాద్‌లో పడటంతో నలుగురికి గాయాలయ్యాయి. 15 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ దాడులతో సౌదీ భద్రతా దళాలు అలర్టయి దాడులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. హౌతీలు ప్రయోగిస్తున్న క్షిపణులు, డ్రోన్లను మధ్యలోనే సౌదీ ఇంటర్‌సెప్టర్లు కూల్చి వేస్తుండడంతో వీటికి సంబంధించిన శకలాలు నగరంలో పడి ప్రాణ, ఆస్తి నష్టం చోటు చేసుకుంటుంది. సౌదీ హౌతీ తిరుగుబాటుదారులకు చెందిన యెమెన్‌లోని సనా అల్ సబాహా కేంద్రంపై భారీ దాడులు చేసింది. 

మరిన్ని వార్తలు