ఇజ్రాయెల్ పీఠం ఎవరిది?

05-11-2026 | 05:10am
  1. విపక్షాల్లో చీలికకు నెతన్యాహు ప్రయత్నం 
  2. అరబ్ పార్టీల మద్దతుపై ఐసెన్‌కోట్ ఆశలు
  3. ప్రభుత్వ ఏర్పాటుపై వీడని అనిశ్చితి
  4. మళ్లీ ఎన్నికలు జరుగుతాయా..?

టెల్ అవీవ్, నవంబర్ 4: ఇజ్రాయెల్ పీఠం ఎవరిదనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. విపక్ష పార్టీలో చీలికపై ప్రధాని నెతన్యాహు ఆశలు పెట్టుకుంటే.. అరబ్ పార్టీల(Arab parties) మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు విపక్ష నేత ఐసెన్‌కోట్(Opposition leader Eisenkot) ప్రయత్నాలు చేస్తున్నారు. సయోధ్య కుదరకుంటే మళ్లీ ఎన్నికలు(Elections) నిర్వహించే అవకాశం కూడా ఉంది. ఇటీవల 120 పార్లమెంట్ స్థానాలకు(Parliament seats) జరిగిన ఎన్నికల్లో నెతన్యాహు(Netanyahu) నాయకత్వంలోని లికుడ్ పార్టీ 27 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది.

అయితే.. ఆయన కూటమికి 53 సీట్లు మాత్రమే వచ్చాయి. ప్రతిపక్ష ఐసెన్‌కోట్ కూటమికి 48 సీట్లు, అరబ్ పార్టీల కూటమికి 19 సీట్లు వచ్చాయి. అధికారం చేపట్టేందుకు అవసరమయ్యే 61 సీట్ల మ్యాజిక్ ఫిగర్‌ను ఎవరూ సాధించలేదు. దీంతో హంగ్ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా రెండు ప్రధాన కూటములు కసరత్తు చేస్తున్నాయి. దీంతో 19 సీట్లు సాధించిన అరబ్ పార్టీలు కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఏర్పడింది.

చీలికపై నెతన్యాహు.. అరబ్బులపై ఐసెన్ కోట్ కన్ను

అరబ్ పార్టీల మద్దతు తీసుకుంటే యూదు దేశం అనే ప్రత్యేకతను ఇజ్రాయెల్ కోల్పోతుందనే కొత్త వాదనను ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ముందుకు తెచ్చారు. యూదులంతా ఒక్కతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. ఈ నినాదంతో విపక్ష ఐసెన్‌కోట్ కూటమిని చీల్చాలని.. అరబ్ పార్టీల మద్దతును వ్యతిరేకిస్తున్న ఐసెన్‌కోట్ కూటమిలోని పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నెతన్యాహు ప్లాన్ చేస్తున్నారు. ప్రధానంగా పాతమిత్రులు నఫ్తాలి బెన్నెట అవిగ్డోర్ లీబర్‌మన్‌లను తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

అరబ్ పార్టీలు మాత్రం నెతన్యాహుకు చెక్ పెట్టేందుకు విపక్ష ఐసెన్‌కోట్ కూటమికి బేషరతు మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. అయితే.. అరబ్ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోమని ఎన్నికల సందర్భంగా ఐసెన్‌కోట్ చేసిన వాగ్దానం ఇప్పుడు ఆయనకు అడ్డంకిగా మారింది. అరబ్ పార్టీల మద్దతు తీసుకుంటే.. తమ కూటమిలో చీలిక వస్తుందా..? అనే భయం ఆయనను వెంటాడుతోంది. ౨౮, ౧౪ రోజుల గడువులు ముగిశాక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే మళ్లీ ఎన్నికలు తప్పవు.

మరిన్ని వార్తలు