కక్ష్యలోకి ఎన్‌వీఎస్-03

05-11-2026 | 05:15am
  1. ఇస్రో ఖాతాలో మరో మైలురాయి
  2. ‘నావిక్’ సేవలకు మరింత బలం 
  3. ప్రధాని మోదీతో పాటు ప్రముఖుల హర్షం
  4. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు

శ్రీహరికోట, నవంబర్ 4 (విజయక్రాంతి): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(Indian Space Research Organisation) (ఇస్రో) మరో మైలురాయిని అధిగమించింది. దేశీయ నావిగేషన్ వ్యవస్థ(Indigenous navigation system) ‘నావిక్(NavIC)’ను బలోపేతం చేసే లక్ష్యంతో ఎన్‌వీఎస్--03  ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. గత నెల 30న రాత్రి 11:51 గంటలకు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని(Sriharikota) సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్‌ఎల్‌వీ--ఎఫ్18 రాకెట్, 18 నిమిషాల వ్యవధిలోనే ఎన్‌వీఎస్-03 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చింది. ఈ విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.

స్వదేశీ నావిగేషన్‌కు జవసత్వాలు

అమెరికా జీపీఎస్ సాంకేతికతకు దీటుగా, భారత్ సొంతంగా రూపొందిస్తున్న ‘నావిక్’ వ్యవస్థకు ఇప్పటివరకు ఎదురవుతున్న ఆటంకాలకు తెరపడింది. గతంలో కక్ష్యలోకి పంపిన కొన్ని ఉపగ్రహాల్లోని అణుగడియారాలు సాంకేతిక లోపాలకు గురికావడం, అలాగే ‘ఎన్‌వీఎస్--02’ ప్రయోగం ఆశించిన విజయం సాధించకపోవడంతో ఈ ప్రాజెక్టుకు కొంత అంతరాయం ఏర్పడింది. అయితే, తాజాగా ఇస్రో చేపట్టిన ‘ఎన్‌వీఎస్--03’ ఉపగ్రహ ప్రయోగం పూర్తి విజయవంతమై, నిర్దేశిత కక్ష్యలోకి చేరింది.

ఈ విజయంతో భారత స్వదేశీ నావిగేషన్ సేవల సామర్థ్యం మరియు పరిధి మరింత బలోపేతం కానున్నాయి. నావిక్ వ్యవస్థ ద్వారా భారత భూభాగంతో పాటు దేశ సరిహద్దుల వెలువల అవతల సుమారు 1,500 కిలోమీటర్ల మేర అత్యంత కచ్చితమైన సమాచారాన్ని అందిస్తుంది. అంతేకాకుండా రోడ్డు రవాణా, విమానయానం, సముద్రయానం, వాహనాల ట్రాకింగ్ (జియో-ఫెన్సింగ్) మరియు అత్యవసర రెస్క్యూ సేవల్లో ఈ వ్యవస్థ అత్యంత కీలకంగా మారనుంది.

మరిన్ని వార్తలు