వీసా, మాస్టర్‌కార్డ్ కస్టమర్ల డేటాసైబర్ నేరగాళ్ల చేతుల్లోకి!
అమెరికాలోని అతిపెద్ద బ్యాంక్ జేపీ మోర్గాన్ చేజ్ కూడా హ్యాక్
న్యూఢిల్లీ, నవంబర్ 20: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. దిగ్గజ కంపెనీలు, బ్యాంకులపై దాడులు చేస్తూ.. కస్టమర్ల డేటాను ఎత్తుకుపోతున్నారు. తాజాగా కీలకమైన వీసా, మాస్టర్‌కార్డ్ సంస్థలతో పాటు అమెరికాలోని దిగ్గజ బ్యాంక్ జేపీ మోర్గాన్ చేజ్(JPMorgan Chase)ను హ్యాక్ చేశారు. దీంతో కస్టమర్ల పేర్లు, ఈమెయిల్స్ వారి చేతుల్లోకి వెళ్లాయి. సైబర్ దాడిని ఈ సంస్థలు గుర్తించి.. దిద్దుబాటు చర్యలు చేపట్టాయి. తమకు సేవలందించే థర్డ్ పార్టీ సంస్థలపై సైబర్ దాడి జరిగిందని, దాని ప్రభావం తమ మీద పడిందని పేర్కొన్నాయి. పరిమిత స్థాయిలో డేటా లీకైందని, పేమెంట్స్ సమాచారం భద్రంగానే ఉందని తెలిపాయి.
బ్యాంకింగ్ సేవలకు ఎలాంటి అంతరాయం కలగలేదని వెల్లడించాయి. ‘హ్యాకర్లు కేవలం కొందరు కస్టమర్ల పేర్లు, ఈమెయిల్స్‌ను యాక్సెస్ చేశారు. కార్డుల నెంబర్లు కానీ, పేమెంట్స్ కానీ వారి చేతుల్లోకి వెళ్లలేదు. ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవరి సమాచారం అయితే హ్యా కర్ల చేతికి వెళ్లిందో సమాచారం అందించాం’ అని సంస్థ తెలిపింది. కాగా, వరుసగా సైబర్ అటాక్స్ జరుగుతుండటంతో అమెరికాలోని ట్రంప్ సర్కార్ చర్యలకు దిగింది. వైట్ హౌస్ సైబర్ సెక్యూరిటీ చీఫ్ సీన్ కెయిర్న్స్‌తో రాజీనామా చేయించింది. హ్యాకర్లను వదిలిపెట్టబోమని, సైబర్ అటాక్స్‌ను సహించేది లేదని ట్రంప్ హెచ్చరించారు.