వడ్డీరేట్ల పెంపుతో మందగిస్తున్న వృద్ధి
- భారత్‌లో వడ్డీరేట్లు తక్కువ, అమెరికాలో ఎక్కువ
- ఫెడరల్ బ్యాంకు నిర్ణయాలపై ట్రంప్ ఆగ్రహం
వాషింగ్టన్, నవంబర్ 21: భారత్‌లో వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నాయని, అందుకే ఆ దేశ జీడీపీ(Country's GDP) ఏడు శాతానికి పెరిగిందని, ఫెడరల్ బ్యాంకు వడ్డీరేట్లను తగ్గిస్తే అమెరికా వృద్ధి 15 నుంచి 20 శాతం సాధ్యమేనని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(President Donald Trump) అన్నారు. వృద్ధిని బలో పేతం చేసేందుకు, వ్యాపార, పెట్టుబడులను ప్రోత్సహించేందుకు తాము ప్రయత్నిస్తుంటే ఫెడరల్ బ్యాంకు మాత్రం అందుకు విరుద్ధంగా వడ్డీరేట్లను పెంచుకుంటూ పోతుం దని దీంతో వృద్ధి మందగిస్తుందని అన్నారు.
వైట్‌హౌస్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో ట్రంప్ ఫెడరల్ బ్యాంకు నిర్ణయాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకు రాజకీయ ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. అధిక వృద్ధిరేటు దేశానికి నష్టం కలిగిస్తుందన్నారు. వడ్డీరేట్లను తగ్గిస్తే వేగంగా అప్పులు తీర్చొచ్చని, ఆర్థికంగా ఉన్నతస్థానానికి చేరుకోవచ్చని అన్నారు.
కొన్ని దేశాలు మనవల్లే ఆర్థికంగా ఉన్నతస్థాయికి చేరుకున్నాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. వడ్డీరేట్లను తగ్గించాలన్న ట్రంప్ నిర్ణయాన్ని ధిక్కరిస్తూ అమెరికా ఫెడరల్ బ్యాంకు ఈ ఏడాది సెప్టెంబర్‌లో 25 బేసిస్ పాయింట్లను పెంచడంతో అధ్యక్షుడు విరుచుకు పడ్డారు. ట్రంప్ రెండోసారి పగ్గాలు చేపట్టాక కూడా అమెరికా వృద్ధి రేటులో ఏ మాత్రం ఎదుగుదల లేదు. 2017లో ఆయన పగ్గాలు చేపట్టాక తొలిసారి 2.46 శాతం వృద్ధిరేటు ఉండగా, 2026లో 2.3 శాతాన్ని మించదని ఆర్థిక విశ్లేషకులు ప్రకటించారు.