ట్రంప్‌కు షాక్
- అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్ల హవా
- రెండు సభల్లోనూ రిపబ్లికన్ పార్టీకి ఘోర పరాజయం
వాషింగ్టన్, నవంబర్ 4: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు(Donald Trump) ఆ దేశ ఓటర్లు(Voters) షాక్ ఇచ్చారు. తాజాగా జరిగిన మధ్యంతర ఎన్నికల్లో(Midterm election) కాంగ్రెస్‌లోని రెండు సభల్లోనూ ఆయన పార్టీ రిపబ్లికన్ మెజార్టీ కోల్పోయింది. ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ(Democratic Party) అత్యధిక సీట్లు సాధించి అటు ప్రతినిధుల సభలో, ఇటు సెనేట్‌లో ఆధిక్యం ప్రదర్శించింది. దానికితోడు పలు రాష్ట్రాల గవర్నర్ల ఎన్నికల్లోనూ ట్రంప్ పార్టీ చతికిలపడింది. రిపబ్లికన్ పార్టీలోని కీలక నేతలు కూడా ఓటమిని చవిచూశారు.
రెండు సభల్లో డెమోక్రాట్లు మెజారిటీ సాధించడంతో రాబోయే రెండేండ్లు ట్రంప్ ఆటలకు కళ్లెం పడనుంది. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనుకున్నా కాంగ్రెస్‌లో తమ బలంతో డెమోక్రాట్లు అడ్డుకునే అవకాశం ఉంది. అయితే.. తాను వెనక్కి తగ్గబోనని, మిస్టర్ వీటోగా అవతారమెత్తుతానని ట్రంప్ ప్రకటించారు.
ఎన్నికల ఫలితాలను స్వాగతిస్తూనే.. ‘వీటో’ అని రాసి ఉన్న టోపీని సోషల్ మీడియా అకౌంట్లో పోస్టు చేశారు. తన నిర్ణయాలను అడ్డుకోవాలని చూస్తే వీటో అధికారాలతో డెమోక్రాట్లను తన వద్దకే రప్పించుకుంటానని హెచ్చరించారు. బ్యాలెట్‌పై తన బొమ్మ ఉంటే మాత్రం రిపబ్లికన్లు ఈజీగా గెలిచేవారని ఆయన వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్‌లో ‘బ్లూ’నామీ
అమెరికా కాంగ్రెస్ (పార్లమెంట్)లోని దిగువ సభగా పిలిచే ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్), ఎగువ సభగా పిలిచే సెనేట్‌కు మంగళవారం ఎన్నికలు జరిగాయి.
* మొత్తం 435 స్థానాలున్న ప్రతినిధుల సభకు రెండేండ్లకోసారి ఎన్నికలు జరుగుతుంటాయి. ఇందులో మెజారిటీ సాధించాలంటే 218 సీట్లు రావాలి. ఇప్పటివరకు ఈ దిగువ సభలో ట్రంప్ పార్టీ రిపబ్లికన్‌కు 220 స్థానాలతో ఉంది. ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీకి 215 స్థానాలు ఉన్నాయి. తాజాగా 435 సీట్లకు ఎన్నికలు జరగగా.. డెమోక్రటిక్ పార్టీ 230 స్థానాలు గెలుచుకుంది. మరో 33 సీట్లలో ముందంజలో ఉంది. అంటే మెజారిటీని ప్రతిపక్ష పార్టీ దాటేసింది. ట్రంప్ పార్టీ రిపబ్లికన్ను 139 స్థానాలకు పడిపోయింది. మరో 35 చోట్ల ముందజంలో ఉన్నప్పటికీ ఆ పార్టీకి గెలుపుపై అనుమానాలే వ్యక్తమవుతున్నాయి.
* మొత్తం 100 స్థానాలున్న ఎగువ సభ సెనేట్‌కు సభ్యుల పదవీకాలం ఆరేండ్లు. అయితే.. ప్రతి రెండేండ్లకోసారి వన్ బై థర్డ్ సీట్లకు అంటే 35 సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. ఇందులో మెజారిటీ సాధించాలంటే 50 సీట్లు రావాలి. ప్రస్తుతం సెనేట్‌లో రిపబ్లికన్ పార్టీకి 53 మంది, డెమోక్రటిక్ పార్టీకి 45 మంది సభ్యుల బలం ఉంది. మరో ఇద్దరు స్వతంత్రులు. తాజాగా వీటిలో 35 సీట్లకు ఎన్నికలు జరగగా.. ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది. మొత్తం 100 సీట్లున్న సెనేట్‌లో తాజా ఎన్నికల ఫలితాలను కలుపుకొంటే డెమోక్రటిక్ పార్టీ 53 సీట్లు దాటేసింది. ఇక, ట్రంప్ పార్టీ రిపబ్లికన్ 42 స్థానాలకు పడిపోయింది. మరో ఇద్దరు స్వతంత్రులు గెలిచారు.
* అటు ఎగువ సభలో, ఇటు దిగువ సభలో రెండింటిలో డెమోక్రటిక్ పార్టీ జెండా బ్లూ సునామీ సృష్టించింది. ఆ దెబ్బకు రెండు చోట్ల ట్రంప్ పార్టీ ఘోరంగా దెబ్బతిన్నది. 90 ఏండ్లుగా రిపబ్లికన్లకు కంచుకోటగా ఉన్న కాన్సస్ సెనేట్ స్థానాన్ని డెమోక్రాట్లు కైవసం చేసుకున్నారు. మిచిగన్‌లో సెనేట్ స్థానాన్ని మొదటిసారి ముస్లిం అభ్యర్థి అబ్దుల్ ఎల్ సయెద్ గెలుచుకున్నారు.

కమలా హ్యారీస్ ‘హల్లెలూయా’
వాషింగ్టన్, నవంబర్ 4: డెమోక్రాట్ పార్టీ, అభ్యర్థుల విజయం కోసం అత్యంత ఎక్కువగా కష్టపడ్డ, ప్రచారంలో ముందువరుసలో నిలిచిన కమలా హ్యారీస్ మధ్యంతర ఎన్నికల్లో విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. బుధవారం ‘హల్లెలూయా’ అనే నాలుగు సెకన్ల నిడివి గల వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మరోవైపు అమెరికా వ్యాప్తంగా డెమోక్రటిక్ పార్టీ విజయం పట్ల పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున సంబురాలు చేసుకున్నారు.