4 May, 2026 | 5:26 AM

11.4 ఎకరాల భూమిని కాజేశారు

10-12-2024 01:12 AM

* బస్వన్నపల్లిలో పలువురి ఆందోళన

కామారెడ్డి, డిసెంబర్ 9 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలోని సర్వే నంబర్ 577లో వేముల బస్వయ్య పేరుమీద ఉన్న 11 ఎకరాల 4 గుంటల భూమి ని బస్వన్నపల్లికి చెందిన కాటిపల్లి లక్ష్మి, కాటిపల్లి హన్మారెడ్డి, కాటిపల్లి వెంకట్‌రెడ్డి, కాటిపల్లి ఎల్లారెడ్డి అక్రమంగా పట్టా చేసుకున్నారని వేముల బస్వయ్య మనుమలు సోమవారం ఆందోళన చేపట్టారు. తమ భూమి తమకు ఇప్పించాలని కోరారు. 1978 నుంచి 1995 వరకు తమ తాత వేముల బస్వయ్య పేరు మీద ఉన్న 11 ఎకరాల 4 గుంటల భూమిని కబ్జా చేసి సాగు చేసుకుంటున్నారని ఆరోపించారు. పహాణి నకలు చూపు తూఆందోళన చేపట్టారు.