ఏసీబీకి పట్టుబడిన ట్రెజరీ ఉద్యోగి
లంచం తీసుకుంటుండగా పట్టివేత
ఖమ్మం, డిసెంబర్ 9 (విజయక్రాంతి): ఖమ్మం కలెక్టరేట్‌లోని ట్రెజరీ కార్యాలయ ఉద్యోగి కే నగేశ్ సోమవారం లంచం తీసు కుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తిరుమలాయపాలెం మండలం బీరోలు గ్రామానికి చెంది న మల్లయ్య సుబ్లే డు ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో అటెండర్‌గా పని చేసి, సంవత్సరం క్రితం చనిపోయాడు. ఆయన భార్య తన భర్త పెన్షన్‌కు సంబంధించి రూ.4 లక్షల ఏరియర్ బిల్స్ కోసం ట్రైజరీ ఆఫీస్‌ను ఆశ్రయించింది.
అక్కడ పనిచేసే సీనియర్ అకౌంటెంట్ కే నగేశ్ బిల్లు చేయాలంటే రూ.నాలుగు లక్షలకు 10 శాతం చొప్పున కమీషన్ ఇవ్వాలని, అందుగాను రూ.40 వేలు చెల్లించాలని డిమాండ్ చేశాడు. దీంతో ఆమె ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. వారి సూచనతో సోమవారం రూ.40 వేలు నగదు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ రమేశ్ ఆధ్వర్యంలో పట్టుకున్నారు.






