calender_icon.png 30 July, 2025 | 8:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సదాశివపల్లి వాసులకు 12 ఇళ్లు మంజూరు

29-07-2025 12:50:10 AM

ప్రజాభవన్ లో ప్రొసీడింగ్స్ అందించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి 

తిమ్మాపూర్, జూలై28(విజయక్రాంతి):గత టిఆర్‌ఎస్ ప్రజల గోడు పట్టించుకోకుండా ప్రగల్భాలు, ఆర్భాటాలతో పాలన కొనసాగించిందని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ విమర్శించారు. సోమవారం ఎల్‌ఎండి కాలనీలోని ప్రజా వేదిక కార్యాలయంలో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఏడవ డివిజన్ (సదాశివ పల్లి) కు చెందిన 12 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఆర్భాటాలు, ప్రగల్భాలు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. ఇందిరమ్మ ఇంటి పథకం కింద మంజూరు చేస్తున్న ఇళ్ల ను డబ్బా ఇళ్లంటూ ఎగతాళి చేస్తున్న బీఆర్‌ఎస్ నాయకులు పదేళ్ల పాలనలో ఎందుకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎందుకు ఇవ్వలేదని ఆయన సూటిగా ప్రశ్నించారు.

ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులు మూడు నెలలలోగా ఇళ్లు కట్టుకోవాలన్నారు. ఇల్లు నిర్మించుకునే వారికి దశలవారీగా బిల్లుల చెల్లింపులు జరుగుతాయని, ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

కార్యక్రమంలో మానకొండూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నందగిరి రవీంద్రచారి, 7వ డివిజన్ అధ్యక్షుడు బండి మల్లేశం, పార్టీ , వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు వదిలి యాదవ్, వైస్ చైర్మన్ రాముడి తిరుమల్ రెడ్డి, నాయకులు తాళ్లపల్లి సంపత్ గౌడ్, రామిడి తిరుపతి, రామిడి శ్రీనివాస్ రెడ్డి, మాతంగి సహదేవ్, సాయిరి దేవయ్య, తదితరులుపాల్గొన్నారు.