calender_icon.png 31 July, 2025 | 2:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్ బిల్లుపై అసత్య ప్రచారాలు మానుకోవాలి

29-07-2025 12:48:52 AM

సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి 

కొత్తపల్లి, జులై 28(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో నరేందర్ రెడ్డి మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ బిల్లు పై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తొండి మాటలతో రాజకీయాలు చేస్తూ, బీసీలను, బీసీ సంఘాలను మోసం చేస్తున్నారని,

రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపీలు ఉండి కుడా పార్లమెంట్ లో 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించేటట్లు చూడడం లేదని , గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం దశబ్ద కాలంగా అమలు చేయలేని బిల్లును కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందని, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బీసీ నాయకులు అయివుండి అసలు విషయాన్ని పక్కన పెట్టి బీసీల రిజర్వేషన్, బీసీల హక్కుల కోసం పోరాటం చేసే వారిని తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు.

రాహుల్ గాంధీ అన్ని వర్గాల వారికి సమన్యాయం జరగాలని కోరుకుంటున్నారని, వారిపై కుడ అవకులు చేవక్కులు మాట్లాతున్నారన్నారు. గత మూడు రోజుల క్రితం హుజురాబాద్ ఎమ్‌ఎల్‌ఎ పాడి కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రి పై ఆధారం లేని మాటలు మాట్లాడరని, అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రి పై చేసిన ఆరోపణలు నిరధరమైనవని, ఇకపై నిరాధార ఆరోపణలు చేయడవద్దని హెచ్చరిస్తూ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అగ్రహానికి గురైవుతారని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలుపాల్గొన్నారు.