29-07-2025 12:51:00 AM
లయన్స్ డిస్టిక్ గవర్నర్ ప్రకాష్ రావు
కామారెడ్డి, జూలై 28 (విజయక్రాంతి): లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సామాజిక సేవ చేసేందుకు ఒక ఫ్లాట్ ఫామ్ గా ఉపయోగపడుతుందని లయన్స్ డిస్టిక్ గవర్నర్ డాక్టర్ ప్రకాష్ రావు అన్నారు. కామారెడ్డి 54వ లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. కామారెడ్డిలో గత 54 సంవత్సరాల నుంచి లైన్స్ క్లబ్ చేసిన సేవా కార్యక్రమాలు ఆదర్శవంతంగా ఉన్నాయన్నారు.
నూతన కమిటీ సభ్యులు అదే విధంగా కార్యక్రమాలు నిర్వహిం చాలని సూచించారు. కామారెడ్డి లైన్స్ క్లబ్ అధ్యక్షునిగా గుండెల్లి ప్రవీణ్ కుమార్ యాదవ్, కార్యదర్శిగా శ్రీధర్, కోశాధికారిగా రమేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ ఫాస్ట్ డిస్టిక్ వైస్స్ ప్రెసిడెంట్ లు రాజ్ కుమార్, విజయలక్ష్మి, నరసింహారాజు, అనితారెడ్డి, శ్యాం గోపాల్ రావు, పాల్గొన్నారు. నూతన కార్యవర్గానికి స్వాగతం పలికారు. అనంతరం నూతన పాలక వర్గ సభ్యులను ఈసందర్భంగా సన్మానించారు.