24-04-2025 01:02:13 AM
గెజిట్ విడుదల చేసిన ప్రభుత్వం
మాట నిలబెట్టుకున్న మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే రాగమయి
గ్రామస్తుల హర్షం
కల్లూరు ఏప్రిల్ 23 (విజయక్రాంతి) క ల్లూరు మేజర్ గ్రామ పంచాయతీ ని మున్సిపాలిటీ గా చేస్తూ రాష్ట్ర గవర్నర్ ఆమోదంతో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సత్తుపల్లి శాసన సభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఇచ్చిన హామీ మేరకు కల్లూరు మున్సిపాలిటీ చేసినందుకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో కల్లూరు మున్సిపాలిటీ చేయాలని అధికారులు ప్రతిపాదన పంపించటం జరిగింది
. కల్లూరు పంచాయతీలో కల్లూరు జీడి పిపల్లి, ఖాన్ ఖాన్ పేట, శ్రీరాంపురం ఉండ గా ప్రస్తుతం మున్సిపాలిటీగా చేయటంతో కప్పల బంధం,పుల్లయ్య బంజర, తూర్పు లోకవరం,పడమర లోకావరం, కిష్ట య్య బంజర, హనుమతండ, వాచ్య నాయక్ తం డ గ్రామ పంచాయతీలను కూడా మున్సిపాలిటీలో కలుపుతూ గ్రామపంచాయతీల నుం చి తీర్మానం చేసి పంపించారు. తీర్మానం ప్ర కారం అసెంబ్లీలో ప్రతిపాదించడంతో ప్రభు త్వం తీర్మానం చేసి రాష్ట్ర గవర్నర్ పంపించడం జరిగింది. రాష్ట్ర గవర్నర్ ఆమోదంతో కల్లూరు మున్సిపాలిటీగా మారింది.
మంత్రులకు కృతజ్ఞతలు
కల్లూరు మున్సిపాలిటీగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వానికి మున్సిపాలిటీ చేయడం లో విశేషమైన కృషి చేసిన సత్తుపల్లి శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద కి స్థానిక కాంగ్రెస్ నాయకులు మూకర విజయరావు, భూక్యా శివకుమార్ నాయక్, మట్టా రామకృష్ణ గౌడ్ తదితరులు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. కల్లూరు ప్రజల చిరకాల కోరికను నెరవేర్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరావులకు స్థానిక పార్టీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.