24-04-2025 01:01:28 AM
హుస్నాబాద్, ఏప్రిల్ 23 : పేదోళ్ల కంచం లో సన్న బియ్యం బువ్వ పెడుతున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని రవాణా, బీసీ సంక్షే మ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు . బుధవారం ఆయన సిద్దిపేట జిల్లా కోహెడలో సన్న బియ్యం లబ్ధిదారురాలు తలారి మల్లవ్వ ఇంట్లో కలెక్టర్ మనుచౌదరి, ఇతర అధికారులతో కలిసి లంచ్ చేశారు.
వారికి ఎన్ని కిలోల సన్నబియ్యం వస్తున్నా యో, గతంలో ఉన్న పరిస్థితులు, ఇప్పుడున్న పరిస్థితులపై మంత్రి ఆరా తీశారు. లంచ్ చేసిన తరువాత ఆయన మాట్లాడారు. ‘కోహెడలోని తలారి మల్లవ్వ ఇంట్లో జిల్లా కలె క్టర్, నేను, నాయకులు అందరం కలిసి భోజ నం చేశాం. మల్లవ్వ మంచి భోజనం పెట్టిం ది. వారిది రేకుల గుడిసె. వారికి ఇందిరమ్మ ఇల్లు కావాలని అడిగారు. ఇల్లు మంజూరు చేస్తాం.
ఒకవైపు సన్నబియ్యం, మరోవైపు ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, గురుకులాల్లో నాణ్యమైన భోజనం అందించడానికి మెస్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచాం. ఉద్యోగ నియామకాలు చేశాం. సన్న వడ్లకు రూ. 500 బోనస్ తోపాటు అనేక కార్యక్రమాలు చేపడుతున్నం. సన్నబియ్యం కార్యక్రమం చారిత్రాత్మక నిర్ణయం.
దేశంలో తెలంగాణలో మాత్రమే ఈ కార్యక్రమం జరుగు తోంది. దీనిని కూడా రాద్ధాంతం చేసే ప్రయ త్నం వద్దు. మిగితా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకునేలా కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తు న్న వారు చెప్తే సంతోషిస్తాం. ఎవరు హక్కుదారులు, ఎవరు వాటాదారులు అనే సంద ర్భం కాదు. సన్నబియ్యం తింటున్న ప్రజలకు ఇంకా ఏవిధంగా మేలు చేయాలనే ఆలోచిస్తున్నాం‘ అని మంత్రి అన్నారు.
ఉగ్రదాడిని ఖండించిన మంత్రి
జమ్ము కశ్మీర్లోలోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రం గా ఖండించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం కఠినం గా వ్యవహరించాలని కోరారు. దేశ అంతర్గత భద్రతకు సంబంధించిన అంశాల్లో కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉం టుందన్నారు.
మూడు రోజుల క్రితం ఆ ప్రాంతానికి వెళ్లినప్పుడు, పర్యాటకులు వస్తే నే తమకు ఉపాధి లభిస్తుందని స్థానికులు చెప్పారని, ఈ దుశ్చర్యతో వారి ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సంకోచం లేకుండా కఠినంగా వ్యవహరించాలని కోరారు. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలిపారు.