02-08-2025 01:04:14 AM
ములుగు, ఆగస్టు1 (విజయక్రాంతి): నేటి బాలలే రేపటి భావితరాల పౌరుల తరహాలోనే ఈనాటి మొక్కలే రేపటి భారీ వృక్షా లుగా తయారవుతాయని, ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడుకో వాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.
శుక్రవారం ములుగు మండలం ఇంచర్ల గ్రామంలోని ఏకో పార్కులో మంత్రి ధనసరి అనసూయ సీతక్క,జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్, ఆర్ పిఎఫ్ 39 బెటాలియన్ కమాండెంట్ ప్రశాంత్ కుమార్,టి జి ఎస్పి 5వ బెటాలియన్ కమాండెంట్ సుబ్రమణ్యం, డీఎఫ్‌ఓ రాహుల్ కిషన్ జాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోతు రవిచందర్, ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణిలతో కలిసి వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ 25వేల మొక్కలు నాటాలని లక్ష్యంతో సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం ఆశించదగ్గ విషయమని అన్నారు. ములుగు జిల్లా పర్యటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని పర్యటక ప్రాంతంతో పాటు దట్టమైన అడవులు ఉండటం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని అన్నారు. ఈకో ప్రాంతంలో వాచ్ టవర్,వాక్ ఫాల్స్ ఏర్పాటు చేయడం చెప్పుకోదగ్గ విషయమని, అడవులను రక్షిస్తూనే పచ్చదనాన్ని కాపాడుకోవాలని సూచించారు.
స్వచ్ఛమైన గాలి ద్వారా వారి ఆయుష్ పెరుగుతుందని,అడువులను కాపాడే విషయంలో తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ములుగు జిల్లాను అడవి జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు కృషి చేస్తూ పర్యావరణాన్ని కాపాడుకోవాలని ఆమె సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మా చిన్నతనంలోవన మహోత్సవం గురించి పుస్తకాలలో ప్రత్యేకంగా చదువుకున్నామని కానీ నేడు ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న వనమోత్సవం కార్యక్రమంలో భాగస్వాములు అవడం చాలా సంతోషంగా ఉందని కలెక్టర్ తెలిపారు. ములుగు జిల్లా ఎక్కువ అటవీ విస్తీర్ణం కలిగి ఉందని,జిల్లాలో వనదేవతలు కొలువై ఉన్నారని పేర్కొన్నారు
రామప్ప నుండి లక్కవరం వరకు నీటి కాలువ
ములుగు గోవిందరావుపేట, ఆగస్టు1 (విజయక్రాంతి): రాష్ట్రంలోని రైతుల కోసం సాగునీటి వనరుల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మంత్రి ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. శుక్రవారం గోవిందరావుపేట మండలం లక్నవరం సరస్సులోని నీటిని మంత్రి ధనసరి అనసూయ సీతక్క,జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణిలతో కలిసి పంట కాలువలకు విడు దల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రామప్ప నుండి లక్కవరం వరకు నీటి కాలువను ఏర్పాటు చేస్తామని, దీని ద్వారా రైతులకు ఏడాదిలో రెండు పంటలకు నీరు అందించే అవకాశం ఏర్పడు తుందని వెల్లడించారు. మన పూర్వీకులు, ముఖ్యం గా కాకతీయులు ఊరిని అభివృద్ధి చేసేందుకు చెరువులను తవ్వించి సాగునీరు తాగునీరు అందించే వారు వారి ఆచారాల ను అనుసరించి,
గ్రామీణా భివృద్ధిని ఊహిం చుకోగలిగే ప్రణాళికల తో పని చేస్తున్నామని,చెరువుల్లో నీరు ఉంటే ఊరు పచ్చగా మారుతుందనీ, అదే స్ఫూర్తితో రైతులకు నీటి కొరత లేకుండా పనిచేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని రంగాల్లో కృషి చేస్తోందని తెలిపారు.