01-05-2025 12:00:00 AM
టాపర్‌గా మోడల్ స్కూల్ విద్యార్థిని
నాగల్ గిద్ద, ఏప్రిల్ 30: నాగల్ గిద్ద మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ మాడల్ స్కూల్ విద్యార్థిని హేమబిందు 572 మార్కులతో మండలంలో టాపర్‌గా నిలవగా, కదడే వైశాలి 571 మార్కులుతో రెండవ ర్యాంకు సాధించారు. మండలంలో 224 విద్యార్థులకు 223 విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కరముంగీ, కరస్ గుత్తి, నాగల్ గిద్ద, గిరిజన గురుకుల పాఠశాలలో విద్యార్థులు 100శాతం ఉత్తీర్ణత సాధించారు.