23-11-2025 12:13:47 AM
విస్తృతంగా ఏఐ సేవల వినియోగానికి సంస్థ ప్రణాళికలు
మానవ వనరుల తగ్గింపుపై కసరత్తు.. మున్ముందు మరిన్ని లేఆఫ్స్
బ్రిటన్, అమెరికా, కెనడా ఉద్యోగులపై ప్రభావం
న్యూయార్క్, నవంబర్ 22: ప్రపంచంలోనే అతిపెద్ద ఈ దిగ్గజమైన అమెజాన్ కంపెనీలో 1800 మంది ఇంజినీర్లకు సంస్థ ఉద్వాసన పలికింది. ఇటీవల సంస్థ 14 వేల కార్పొరేట్ ఉద్యోగాలను తొలగించనున్నట్లు ప్రకటించిన విషయం తెలి సెందే. ఈ ప్రభావంతో క్లౌడ్ సర్వీసెస్, రిటై ల్, అడ్వర్టుజింగ్, గ్రోసరీ వంటి అనేక విభాగాల్లోని ఉద్యోగాల్లో కోత విధిస్తున్నది. ఇం జినీర్ల బృందంపై ఈ లేఆఫ్ ప్రభావం తీవ్రం గా పడింది.
దీనిలో భాగంగానే తాజాగా 1,800 మంది ఇంజినీర్లకు సంస్థ ఉద్వాసన పలికింది. వీరంతా న్యూయార్క్, కాలిపోర్నియా, న్యూజెర్సీ, వాషింగ్టన్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు. ఆయా రాష్ట్రాల్లో 4,700 మందికి పైగా లేఆఫ్ జాబితాలో ఉండగా, వారిలో 40 శాతం మంది ఇంజినీర్లే. అమెరికాలోని ఇతర రాష్ట్రాల్లోనూ సంస్థ అనేక మందికి ఉద్వాసన పలుకనుందని సమాచారం. సంస్థ కార్పొరేట్ వర్క్ ఫోర్స్ దాదాపు 3,50,000 మంది ఉండగా, గత నెలలో 14,000 ఉద్యోగులకు లేఆఫ్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది. సీఎన్‌బీసీ నివేదిక ప్రకారం..
అక్టోబర్ లేఆఫ్ ప్రకటన తర్వాత సంస్థ వ్యాప్తంగా 10% కంటే ఎక్కువ మందిని తొలగించింది. దీనిలో భాగంగానే ఇంజినీర్లు, సీనియర్ మేనేజర్, ప్రధాన స్థాయి ఉద్యోగాలు కూడా ఉద్వాసనకు గురయ్యాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలి జెన్స్‌ను వినియోగించుకుంటూ సంస్థ భార గా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపింది. కొద్ది రోజుల క్రితం అమెజాన్ 30 వేల ఉద్యోగులను తొలగించనుందనే ప్రచారం జరిగింది.
ఈ నేపథ్యంలో ఇటీవల సంస్థ 14,000 ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. త్వరలో హ్యూమన్ రిసోర్సస్, ఆపరేషన్స్, డివైసెస్, సర్వీసెస్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ విభాగాల్లోని ఉద్యోగులపై వేటు పడే అవకాశం ఉంది. ఈ ప్రభావం ఎక్కువగా అమెరికా, బ్రిటన్, కెనడాలోని ఉద్యోగులపై వేటు పడనునుంది. 2020 తరువాత కంపెనీలో ఈస్థాయిలో లేఆఫ్స్ ప్రకటించడం తొలిసారి అని టెక్ వర్గాలు చెబుతున్నాయి.
ఇది ఏఐ యుగం:సంస్థ హెచ్‌ఆర్ చీఫ్ బెత్ గాలెట్టి
ఉద్యోగులకు ఉద్వాసనపై అమెజాన్ మానవ వనరుల చీఫ్ బెత్ గాలెట్టి స్పందిస్తూ.. సంస్థ ఇప్పుడు తక్కువ మందితో పని చేయించే దిశ గా అడుగులు వేస్తున్నదని స్పష్టం చే శారు. ప్రస్తుతం నడుస్తున్నది కృత్రిమ మేధ (ఏఐ) శకమని, ఏఐ వినియోగం పెరగడంతోనే లేఆఫ్‌లు పెరుగుతున్నాని తేల్చిచెప్పారు.
సంస్థ ఏఐ ద్వా రా గతంలో కంటే వేగంగా పనులు చేయించుకునేందుకు సిద్ధమైందని తెలిపారు. సంస్థ సీఈవో ఆండీ జాస్సీ స్పందిస్తూ.. సంస్థను మరింత బలోపేతం చేసేందుకు మేనేజ్‌మెంట్ వ్యవస్థలను తగ్గిస్తూ వస్తున్నామని తెలిపారు.