24 April, 2026 | 5:51 AM

సమస్యాత్మక ప్రాంతాల్లో జియోట్యాగింగ్

12-05-2024 12:20 AM

35,27,441మంది ఓటర్లు

ఎన్నికల సమరానికి సిద్ధం

ప్రత్యక్షంగా భద్రతను పర్యవేక్షిస్తున్న సీపీ

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 11 (విజయక్రాంతి) : పోలింగ్‌కి కొద్ది గంటలు మాత్రమే సమయం ఉండడంతో పోలీసులు ఎన్నికల సమరానికి సిద్ధమయ్యారు. దేశంలోనే అతిపెద్ద కమిషనరేట్ రాచకొండ కమి షనరేట్ అని సీపీ తరుణ్‌జోషి అన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 5 పార్లమెంట్ నియోజకవర్గాలు, 13 అసెంబ్లీ స్థానా లు ఉన్నట్లు తెలిపారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో మొత్తం 35,27,441 ఓటర్లు ఉన్నారని, పోలింగ్ కోసం 3396 పోలింగ్ స్టేషన్లు, 1590 పోలింగ్ లోకేషన్స్ ఏర్పాటు చేశామన్నారు. ఇందులో 533 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు, 188 క్రిటికల్ లోకేషన్స్ గుర్తించినట్లు తెలిపారు. సమస్యాత్మక ప్రాం తాల్లో జియోట్యాంగింగ్ ద్వారా ఎన్నికల తీరును పర్యవేక్షిస్తామన్నారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటీ నుంచి పోలీ సులు నిరంతర తనిఖీలు చేస్తూ మద్యం, డబ్బు అక్రమ రవాణాని అడ్డుకుంటున్నామన్నారు. రాచకొండ పరిధిలో ఇప్ప టి వరకు రూ. 11.9కోట్ల నగదు, రూ. 75.78లక్షల విలువ గల 12240లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు.

రూ.1.9 కోట్ల పలు రకాల మాదకద్రవ్యాలను పట్టుకున్నామని, రూ. 10లక్షల విలువైన ఇతరత్రా సామగ్రి స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. రాచకొండ కమిష నరేట్ పరిధిలో 806 లైసెన్స్‌డ్ తుపాకులు అప్పగించారని తెలిపారు. 4892 మంది నేరస్తులను బైండోవర్ చేశామని, 1036 నింది తులపై నాన్ బెయిలెబుల్ వారెంట్ జారీ చేశామన్నారు. ఎన్నికల విధుల్లో రాచకొండ కమిషనరేట్ పరిధిలో 6000 మంది పోలీసులు, కేంద్ర బలగాలు12 కంపెనీలు, టీఎస్‌ఎస్పీ సెక్షన్  25.5 బలగాలు, లీగల్ మెట్రాలజీ విభాగం ప్రొహిబిషన్ ఎక్సైజ్ సీఏపీఎఫ్5012 బలగాలు పాల్గొంటారని సీపీ తెలిపారు. మే 13 ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, 6గంటల వరకు లైన్లో ఉన్న వారికి మాత్రమే ఓటు వేసే అవకాశం కల్పిస్తామని వివరించారు. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల లో పు ఎలాంటి ప్రచారాలు, నాయకుల హాడావిడి ఉండరాదని వెల్లడించారు. ఓటర్లు తప్పనిసరిగా గుర్తింపుకార్డు వెంట తీసుకురావాలని స్పష్టం చేశారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేయాలని, ప్రజలకు అండగా పోలీసులు ఉంటారని భరోసానిచ్చారు.