24 April, 2026 | 7:22 AM

ఎన్నికల సామగ్రి పంపిణీకి ఏర్పాట్లు పూర్తి

12-05-2024 12:17 AM

జహీరాబాద్, మే 11 : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జహీరాబాద్ నియోజక వర్గంలోని మండలాల్లోని పోలింగ్ కేంద్రాలకు ఆదివారం ఎన్నికల సామగ్రిని తరలిం చేందుకు సంబంధిత అధికారులు ఏర్పాట్లన్నీ సిద్ధం చేశారు. జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల సహాయాధికారి, ఆర్డీవో ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని మండలాల వారీగా ఎన్నికల సామగ్రి, ఈవీఎంలను ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రత్యేక డిస్టిబ్యూషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం నుంచి నియోజకవర్గంలోని 35రూట్లను ఏర్పాటు చేశారు. ఒక్కో రూట్‌కు ఒక్కో వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఈ వాహనాల ద్వారా డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి పోలింగ్ కేంద్రాల నుంచి పోలింగ్ బూత్‌లకు ఈవీఎంలు, ఇతర సామగ్రిని పంపను న్నారు. వీటిని పంపిణీ చేసేందుకు ఒక్కొ రూట్‌లో ఎన్ని పోలింగ్ కేంద్రాలుంటే అన్ని టేబుళ్లను సిద్ధం చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సెక్టోరియల్ అధికారులు, పీవో, ఏపీవోలు, ఓపీవోలు ఈ డిస్టిబ్యూషన్ కేంద్రానికి ఆదివారం చేరుకుంటారు. జిల్లా ఎన్నికల అధికారి, సహాయ ఎన్నికల అధికారుల సమక్షంలో ఈవీఎం యంత్రాలను రూ ట్ల వారీగా పోలింగ్ కేంద్రాలకు పంపిస్తారు. నియోజకవర్గంలోని 313 పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులను సిద్ధం చేశారు. దాదాపు 1300మంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. ఈ నెల 13న 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుండటంతో పోలిం గ్ కేంద్రాల్లో ఆదివారం సాయంత్రం వరకు ఎన్నికల సామగ్రితో అధికారులు చేరుకుంటారు. ఈ ఎన్నికల్లో నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో 2,75,562 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నట్టు సహాయ ఎన్నికల అధికారి, ఆర్డీవో రాజు పేర్కొన్నారు.