calender_icon.png 5 January, 2026 | 6:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి

03-01-2026 08:07:10 PM

హనుమకొండ,(విజయక్రాంతి): భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే  చిత్రపటానికి హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్ రవి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించి విద్యా బోధనలో ఉత్తమ పనితీరు కనబరిచిన మహిళా ఉపాధ్యాయినులను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా  శాలువాలతో సత్కరించి ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే సేవలను గుర్తు చేసుకున్నారు.