calender_icon.png 5 January, 2026 | 3:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇమ్యూనైజేషన్ కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు

03-01-2026 08:09:38 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని  హడ్కో కాలనీలో గల ఇమ్యూనైజేషన్ కేంద్రాన్ని  మాతా–శిశు సంరక్షణ కోఆర్డినేటర్ వాసుదేవ్ , డిప్యూటీ జిల్లా ఎపిడెమియాలజిస్ట్ మార్తా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గర్భిణీలు రక్తహీనతకు గురికాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తమ పరిధిలో ఉన్న అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారాన్ని తప్పనిసరిగా వినియోగించుకోవాలని తెలిపారు. గర్భిణీలు టీడీ  మొదటి ,రెండవ మోతాదులను తగిన సమయంలో తీసుకోవడం ద్వారా తల్లికి మరియు పుట్టబోయే శిశువుకు ధనుర్వాతం (టెటనస్) వ్యాధి రాకుండా నివారించవచ్చని వివరించారు.తోటకూరలు, ఆకుకూరలు, బీట్‌రూట్ వంటి పోషకాహారం తీసుకోవడంతో పాటు ఐరన్, కాల్షియం మాత్రలను క్రమం తప్పకుండా వినియోగించాలని సూచించారు.