25 April, 2026 | 1:32 PM

యువశక్తి నిర్వీర్యం కారాదు

06-03-2025 12:00 AM

నేడు ఉద్యోగ, ఉపాధుల కొరతతో యువశక్తి దేశంలో నిర్వీ ర్యం అవుతుండడం బాధాకరం. ప్రైవేటు రంగాలకు అందించే ఆర్థిక వెసులుబాటు లేదా సబ్సిడీలను ఉద్యోగ ఉపాధుల కల్పనకు లింక్ చేయడం ఒక మంచి ప్రయత్నం అవుతుంది. భారతీయుల భవితను దృష్టిలో పెట్టుకొని పారిశ్రామిక వర్గాలు పెట్టుబడులు పెట్టాలి. మహిళా శక్తికి ఊతమిచ్చేలా ఉద్యోగాల కల్పన, పన్నుల్లో రాయితీలు ఉండాలి. విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపులు రెట్టిం పు కావాలి.

పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకు అన్ని ప్ర భుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో నాణ్యమైన బోధనలకు ప్రాధాన్యం ఇవ్వాలి. నైపుణ్య వికాసంలో సమతుల్యత పాటించాలి. ఉపాధ్యాయులకు కాలానుగుణంగా శిక్షణలు ఇవ్వాలి. టీచర్ల కొరత లేకుం డా చూడాలి. ఢిల్లీలో గత కేజ్రీవాల్ ప్రభుత్వం పాఠశాల విద్యకు సదుపాయాల పెంపులో తీసుకున్న చర్యలు మంచి ఫలితాలను ఇచ్చినట్లు చదివాం. యువతకు ఉత్తమ విద్య, మంచి నైపుణ్యాలు అందడం ద్వారా ఉద్యోగ నియామకాలు ఊపందుకుంటాయి. ప్లంబర్లు, ఎలక్ట్రీఫికేషన్, కార్పెంటరీ వంటి రంగాల్లో యువతకు తగు శిక్షణ కేంద్రాల ద్వారా అవసర నైపుణ్యవిద్యను కల్పించాలి. 

 డా. బుర్ర మధుసూదన్ రెడ్డి, తిమ్మాపూర్

టీచర్ల రెమ్యునరేషన్ ఎప్పుడు?

తెలంగాణలో 10వ తరగతి వార్షిక పరీక్షలు 2023-- విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు సంవత్సరం కావొస్తున్నా ఇంకా రెమ్యునరేషన్ రాకపోవడం బాధాకరం. పదవ తరగతి పరీక్షలలో ఇన్విజిలేటర్, డిపార్ట్మెంట్ ఆఫీసర్, చీఫ్ సూపరింటెండెంట్, సిట్టింగ్ స్క్వాడ్, కస్టోడియన్ మొదలైన డ్యూటీలు చేస్తారు. ఈ ఏడాది నేటి నుంచి ప్రీపైనల్ పరీక్షలు, 21 నుంచి ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. కిందటేడాది పేపర్ వాల్యూవేషన్  స్పాట్‌లో విధులు నిర్వహించిన వారికి రెమ్యునరేషన్ రాకపోవడం విచిత్రం. దూర ప్రాంతాలలో ఉండే పేపర్ వాల్యూవేషన్ సెంటర్ స్పాట్ కు తమ డబ్బులను ఖర్చు పెట్టుకొని వెళ్తే సంవత్సరం గడిచిన ఇంకా ఇవ్వకపోవడంలో అంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. ఈ బకాయిలు చెల్లిస్తే 2024- సంవత్సరంలో ఉత్సాహంగా విధులను నిర్వర్తించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం, విద్యా శాఖాధికారులు తక్షణమే స్పందించి ఈ మేరకు నిధులు విడుదల చేయవలసిందిగా విజ్ఙప్తి. 

 డా. ఎస్. విజయ భాస్కర్, డా. శ్రీవాటి శ్రీనాథ్, హైదరాబాద్