04-12-2025 06:43:20 PM
సభ, సమావేశాలకు అనుమతులు తప్పనిసరి..
ఓటర్లకు మద్యం, డబ్బు పంపిణీ పై ప్రత్యేక నిఘా..
తహసిల్దారు ఎల్లన్న..
చిన్నచింతకుంట: స్వేచ్ఛాయుత ఎన్నికలపై అన్ని శాఖల అధికారులు సమన్వయంగా పనిచేయాలని తహసీల్దారు ఎల్లన్న కోరారు. గురువారం మండల తహసిల్దార్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ డి. జానకి ఆదేశాల మేరకు అన్ని శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ శాంతియుతంగా గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు పోలీస్, ఎక్సైజ్ శాఖలు సమర్థవంతంగా పనిచేయాలని ఆయన కోరారు. గ్రామపంచాయతీ ఎన్నికల నిబంధనలను ప్రజలకు అవగాహన కల్పిస్తూనే ఎక్కడ కూడా అల్లర్లు జరగకుండా అన్ని శాఖల అధికారులు జాగ్రత్తగా పనిచేయాలని ఆయన కోరారు. ఎక్కడైనా గొడవలు జరుగుతే పోలీస్ యాక్ట్ 1861, సెక్షన్ 30, 30ఎ కింద కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.
డిసెంబర్1 నుంచి 31 వరకు ఈ యాక్ట్ అమల్లో ఉంటుందని ఆయన తెలిపారు. ఎన్నికల సమయంలో ఎలాంటి గొడవలు చేయరాదని, అనుమతులు లేకుండా ర్యాలీలు, అర్ధరాత్రి సమావేశాలు నిర్వహించరాదని ఆయన తెలిపారు. సామాజిక మాధ్యమాలలో మతపరమైన పోస్టులు, తప్పుడు ప్రచారాలు, వ్యక్తిగత విమర్శలు చేయరాదని ఆయన సూచించారు. పోలీస్, ఎక్సైజ్ శాఖ అక్రమ మద్యం, డబ్బు పంపిణీపై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. మద్యం సేవించి అల్లలు సృష్టిస్తే చట్టరీత్య చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు. అక్రమంగా మద్యం, డబ్బు పంపిణీ పై ఎన్నికల నియమావళి ఉల్లంఘన పై 100 కు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో లక్ష్మీ నరసింహులు, ఏఎస్ఐ వెంకటస్వామి, ఆర్ఐలు తిరుపతయ్య, అమీర్, ఎక్సైజ్ కానిస్టేబుల్ బాలస్వామి లు ఉన్నారు.