04-12-2025 06:44:39 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): రౌడీషీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలనీ బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకొని గురువారం బెల్లంపల్లి రూరల్ సిఐ కార్యాలయంలో రౌడీ షీటర్లు, పాతనే రస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జీవనశైలి మార్చుకొని జీవనశైలి మార్చుకొని ఎలాంటి నేరాలకు దూరంగా ఉండి గౌరవంగా బతకాలన్నారు. స్థానిక ఎన్నికలను ప్రశాంతత కు విరాటం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారన్నారు. బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలోఉన్న రౌడీ షీటర్స్ పై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. ఎలాంటి నేరాల్లో పాల్గొన్న వారి అందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకొని, వారి మీద పీడీ యాక్ట్ కూడా ఓపెన్ అయ్యేలా చర్యలు ఉంటాయని తెలిపారు. బెల్లంపల్లి రూరల్ సిఐ హెచ్ హనోక్,బెల్లంపల్లి టౌన్ సీఐ శ్రీనివాస్ రావు, తాండూరు సీఐ దేవయ్య, సబ్ డివిజన్ ఎస్ ఐ లు పాల్గొన్నారు.