calender_icon.png 4 December, 2025 | 7:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీజీఎన్పీడీసీఎల్ రివ్యూ సమావేశం

04-12-2025 06:49:55 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): గురువారం రోజున కరీంనగర్ సర్కిల్ సమావేశ మందిరంలో సర్కిల్ రివ్యూ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో కరీంనగర్ సూపర్ ఇంటెండింగ్ ఇంజనీర్ మేక రమేష్ బాబు వివరిస్తూ రాబోయే వేసవి కార్యచరణ ప్రణాళిక సిద్ధంగా ఉండాలని ఏఈలకు, ఏడీలకు ఆదేశించడం జరిగింది. ఎక్కడైతే పవర్ ట్రాన్స్ఫార్మర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఓవర్ లోడ్ అయ్యే అవకాశం ఉంటే అక్కడ అదనపు, సామర్థ్యం పెంపుదల ట్రాన్స్ఫార్మర్ పెట్టాలని ఆదేశించారు. 33కేవీ, 11కేవీ లైన్లు ఓవర్ లోడ్ అయ్యే అవకాశం ఉన్నచోట కొత్త లైన్లు ఏర్పాటు చేయమని ఆదేశించాడు.

వినియోదారులకు అంతరాయాలు లేకుండా 11కేవీ, 33కేవీ మెయింటెనెన్స్ చేయాలని, వ్యవసాయ సర్వీస్ అప్లికేషన్ను 15 రోజుల్లోపు సర్వీస్ కనెక్షన్ ఇవ్వాలని, గృహ, వాణిజ్య మీటర్లు ఏడు రోజుల్లోపు రిలీజ్ కావాలని ఆదేశించడం జరిగింది. 1912 ఫోన్ ద్వారా వినియోగదారుల నుండి వచ్చిన ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే విద్యుత్ ప్రమాదాలు జరగకుండా పొలం బాట, పల్లెబాట, బస్తీబాట, పట్టణ బాట నిర్వహించి వినియోదారులకు అవగాహన సదస్సు నిర్వహించి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా వినియోగదారులకు అవగాహన చేయాలని ఆదేశించడం జరిగింది. ఈ సమావేశంలో డిఈలు కే ఉపేందర్, రాజం, లక్ష్మారెడ్డి,ఎం తిరుపతి, ఎస్ఎఓ రాజేంద్రప్రసాద్, ఏవోలు, ఏఏఓలు, ఏడిఈలు, ఏఈలు, పాల్గొన్నారు.