13-12-2025 01:54:24 AM
విద్యా భారతి హై స్కూల్స్ ఆధ్వర్యంలో క్రీడోత్సవం
పటాన్ చెరు, డిసెంబర్ 12 : భారతి నగర్ డివిజన్లోని ఎల్‌ఐజి కాలనీ ప్రాంగణంలో భారతీ య విద్యా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారతీయ విద్యా హైస్కూల్ల ఐదు శాఖల సంయుక్త క్రీడోత్సవం ఘనంగా ప్రారంభమైంది. డిసెంబర్ 12, 13, 14 తేదీలలో మూడు రోజుల పాటు వివిధ క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాన్చెరు ఎమ్మె ల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, భారతి నగర్ డివిజన్ కార్పొరేటర్ సింధూ ఆదర్శ్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ సింధూ ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ వి ద్యతో పాటు క్రీడలు కూడా విద్యార్థుల సమగ్రాభివృద్ధికి ఎంతో కీలకమని తెలిపారు. క్రీడల్లో పాల్గొనడం ద్వారా ఆత్మవిశ్వాసం, శారీరక ధృడత్వం, జట్టు భావం, నాయకత్వ లక్షణాలు పెరు గుతాయని వివరించారు. ఈ క్రీడోత్సవం విద్యార్థుల ప్రతిభను వెలుగులోకి తెచ్చే వేదికగా నిలు స్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సుజాత, భారతీయ విద్యా సమితి కమిటీ సభ్యులు శ్రీనివాస్, గాల్ రెడ్డి, అవధానాలు, శ్రీనివాస్, కృష్ణ గౌడ్ హాజరయ్యారు. అలాగే ఎల్ ఐ జి కాలనీ సొసైటీ డైరెక్టర్లు యాదగిరి రెడ్డి, లక్ష్మణ్, సామ్యుయేల్ జాన్, ఉపాధ్యాయులు, తది తరులు పాల్గొన్నారు.