ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్
హైదరాబాద్: ఆర్టీసీ ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro) గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మెట్రో సర్వీసులను పెంచారు. మియాపూర్-ఎల్బీనగర్(Miyapur–LB Nagar) మార్గంలో 4 నిమిషాల 20 సెకన్లకో మెట్రో ట్రైన్ అందుబాటులో ఉండనుంది. నాగోల్-రాయదుర్గం(Nagole to Raidurg Metro) మార్గంలో 3 నిమిషాల 40 సెకన్లకో మెట్రో రైల్ పట్టాలపైకి రానుంది. ఆర్టీసీ సమ్మె(RTC Strike) కాలంలో 56 మెట్రో రైళ్లు నడపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సమ్మె వల్ల బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి.
తాజా అప్డేట్స్, బ్రేకింగ్ స్టోరీల కోసం విజయక్రాంతి న్యూస్‌ను సందర్శించండి
ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో హైదరాబాద్ ప్రజలు ప్రత్యామ్నాయ రవాణా మార్గమైన మెట్రో రైల్(Metro Rail) కోసం క్యూ కడుతున్నారు. ప్రయాణికులు ఒక్కసారిగా పోటెత్తడంతో మెట్రో టికెట్ కౌంటర్లు, ఎంట్రీ గేట్స్, ప్లాట్ ఫార్మ్స్ వద్ద భారీ రద్దీ నెలకొంది. దీంతో మెట్రో అధికారులు తగిన చర్యలు చేపడుతున్నారు. అటు మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) సమ్మె విరమించాలని ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేశారు.






