calender_icon.png 24 May, 2025 | 6:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రీ ప్రొడక్షన్‌లో..

22-05-2025 12:38:50 AM

అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబోలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. భారతీయ సినిమా పరిశ్రమలో స్టార్ డైరెక్టర్‌గా పేరు పొందిన అట్లీ తెలుగు కథానాయకుడితో తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై మొదట్నుంచి భారీ అంచనాలున్నాయి. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ సమర్పణలో రూపొందుతున్న అంతర్జాతీయ ప్రాజెక్టు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కొన్ని రోజులుగా ఫుల్ స్వీంగ్‌లో ఉంది.

తాజాగా దర్శకుడు అట్లీ బుధవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఇక్కడ అల్లు అర్జున్‌తో ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ గురించి చర్చించనున్నారు. జూన్‌లో చిత్రీకరణ ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

భారతీయ విలువలతో కూడిన కథనంతో కూడిన ఓ భారీ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. ప్రస్తుతం ‘ఏ22xఏ6’ అనే మేకింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి నటీనటులు, సాంకేతిక బృందం, విడుదల తేదీ తదితర వివరాలను మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు.