29-01-2026 12:00:00 AM
కుషాయిగూడ ఇందిరమ్మ కాంటీన్‌ను పరిశీలించిన బొంతు శ్రీదేవి యాదవ్
కుషాయిగూడ, జనవరి 28 (విజయక్రాంతి) : కుషాయిగూడ కోర్టు సమీపంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కాంటీన్ను జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు, చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ పరిశీలించారు. పరిశీలన సమయంలో కాంటీన్లో ఆహార నాణ్యత, శుభ్రత, వసతుల నిర్వహణకు సంబంధించి సమగ్ర సమీక్ష జరిగింది. ప్రజలకు నాణ్యమైన,
చౌక ధరలో భోజనం అందించడంలో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలని బొంతు శ్రీదేవి యాదవ్ అధికారులు కి సూచనలు చేశారు. పేదలు, కూలీలు, ప్రయాణికులు ఈ సదుపాయాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని కార్పొరేటర్ పిలుపునిచ్చారు. ఈ కాంటీన్ ద్వారా ప్రజలకు చౌకసరమైన భోజనం అందించడం, వారి జీవితాన్ని సౌకర్యవంతం చేయడం ముఖ్య లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.