29-01-2026 03:44:45 PM
కలెక్టర్ కె. హరిత
కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను మార్చి 15 నాటికి పూర్తిచేసి ప్రజల వినియోగంలోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు.
ఉపాధి హామీ పథకం కింద పాఠశాలల మూత్రశాలలు, అంగన్వాడి భవనాలు, గ్రామపంచాయతీ కార్యాలయాలు, వంటశాలలు, సీసీ రహదారులు, గ్రామ సమాఖ్య భవనాలు, పూడ్ గ్రెయిన్ గోదాముల నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు. సమస్యలు ఉన్న చోట తహసిల్దార్ల సమన్వయంతో పరిష్కరించాలని తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా అధికారులు, ఇంజనీరింగ్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.