calender_icon.png 29 January, 2026 | 5:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు

29-01-2026 03:42:32 PM

బస్సుల కోసం గంటల తరబడి నిరీక్షణ 

అన్ని బస్సులు మేడారానికే

కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ఆర్టీసీ యాజమాన్యం మెజార్టీ బస్సులను మేడారంకు కేటాయించడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. బస్సుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బస్సు వచ్చినప్పటికీ రద్దీ ఉండడంతో తోపులాటల మధ్య బస్సులో ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది.

ఇలా ఉంటే ఆర్టీసీ యాజమాన్యం ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులకు ఎక్స్ప్రెస్ బోర్డులు పెట్టి అధిక చార్జీలు దండుకుంటున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఆసిఫాబాద్ డిపో పరిధి నుండి కాగజ్నగర్ ,ఆదిలాబాద్ ఉట్నూర్, మంచిర్యాల వైపు సర్వీసులు నడుస్తూ ఉంటాయి. సమయానికి బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.కాగజ్నగర్ నుండి కౌటాల, బెజ్జూర్, పెంచికల్పేట్ వైపు ఆర్టీసీ సేవలు అందిస్తుంది జాతర సందర్భంగా బస్సు సర్వీస్ లను తగ్గించడంతో ఇబ్బందికరంగా మారింది.